ఆ ఫీట్ లో మనోడే

అంతర్జాతీయ రికార్డ్ ల వేటలో మరో మైలు రాయి దాటాడు ఇండియన్ డ్యాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ. ఇప్పటివరకు టీట్వంటీ లలో అత్యధిక సిక్సర్ల రికార్డ్ వెస్ట్ [more]

Update: 2019-08-05 01:49 GMT

అంతర్జాతీయ రికార్డ్ ల వేటలో మరో మైలు రాయి దాటాడు ఇండియన్ డ్యాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ. ఇప్పటివరకు టీట్వంటీ లలో అత్యధిక సిక్సర్ల రికార్డ్ వెస్ట్ ఇండీస్ ఓపెనర్ క్రిస్ గెయిల్ పేరిట వుంది. ఆ రికార్డ్ ను తాజాగా రోహిత్ తిరగరాశాడు. విండీస్ తో జరిగిన రెండో టీట్వంటీ మ్యాచ్ లో ఈ ఫీట్ అందుకున్నాడు రోహిత్. ఈ మ్యాచ్ లో తన 106 సిక్స్ ను నరైన్ బౌలింగ్ లో బాది గేల్ రికార్డ్ చెరిపేసాడు. రోహిత్ తరువాత ఇప్పుడు గేల్ 105, ఆ తరువాత గుప్టిల్ 103 సిక్స్ లతో మూడోస్థానంలో, కొలిన్ మున్రో 92 తో నాలుగోస్థానంలో, బ్రాండెన్ మెక్కాలం 91 సిక్స్ లతో టాప్ ఫైవ్ లో వున్నారు.

వన్డేల్లో నాలుగోస్థానంలో …

వన్డే క్రికెట్ లో సిక్సర్ల కింగ్ టీం ఇండియా లో టాప్ ప్లేస్ రోహిత్ శర్మదే. 252 సిక్స్ లు కొట్టిన రోహిత్ ప్రపంచ వన్డే క్రికెట్ లో నాలుగో ఆటగాడు కావడం విశేషం. ఈ ఏడాది సూపర్ ఫాం లో వున్న రోహిత్ శర్మ ఇటీవల జరిగిన వరల్డ్ కప్ లో 648 పరుగులు సాధించి తొలి స్థానంలో నిలిచిన బ్యాట్స్ మెన్ అయ్యాడు. వరల్డ్ కప్ లో విరాట్ తో వివాదం ఏర్పడిందన్న పుకార్ల నేపథ్యంలో విండీస్ పర్యటనలో రోహిత్ శర్మ ఆట ఎలా వుండబోతుందన్న అపోహలకు చెక్ పెడుతూ తొలి రెండో టి ట్వంటీలలో తన అద్భుత ఫామ్ తో రాణిస్తున్నాడు రోహిత్ శర్మ. తొలి మ్యాచ్ లో 24, రెండొవ మ్యాచ్ లో 51 బంతుల్లో 67 పరుగులు సాధించడం గమనార్హం. ఈ రెండు మ్యాచ్ లలో టీం ఇండియా విజేతగా నిలవగా అందులో రోహిత్ శర్మ కీలక పరుగులే అందించాడు.

Tags:    

Similar News