కంచుకోట‌లో జ‌న‌సేన హ‌డావిడి స్టార్ట్ ?

జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏపీలో పెద్దగా సందడి చేయడంలేదు. ఆయన తన సినిమాలు ఏంటో తానేంటో అన్నట్లుగా ఉన్నారు. ఏపీలో ఎన్నో జరుగుతున్నా కూడా పవన్ [more]

Update: 2021-09-07 14:30 GMT

జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏపీలో పెద్దగా సందడి చేయడంలేదు. ఆయన తన సినిమాలు ఏంటో తానేంటో అన్నట్లుగా ఉన్నారు. ఏపీలో ఎన్నో జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ కనీసం కళ్ళు తిప్పి ఇటు చూడడంలేదు. ఆయన ధ్యాస అంతా ఇపుడు సినిమాల మీదనే ఉంది. దాంతో ఆయన పార్టీ నాయకులు కూడా అలాగే ఉన్నారు. మరో వైపు చూస్తే విశాఖ లాంటి జిల్లాల్లో జనసేన గతంలో బాగా యాక్టివ్ గా ఉండేది. ఇపుడు మాత్రం నాయకులు ఎందుకొచ్చిన తంటా అనుకుంటూ సొంత పనులు చేసుకుంటున్నారు. ఇక 2019 ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన వారు కూడా ఫుల్ సైలెంట్ అయ్యారు.

చాన్నాళ్లకు బయటకు వచ్చి….

వారు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. కానీ సడెన్ గా భీమిలీ జనసేన క్యాండిడేట్ బయటకు వచ్చారు. ఆయన వైసీపీ సర్కార్ వైఫల్యాల మీద మీద ఉద్యమం అంటూ నియోజకవర్గంలో కాస్తా హడావుడి చేస్తున్నారు. ఆయన పేరు పంచకర్ల సందీప్. ఆయనకు భీమిలీలో పాతిక వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. నిజానికి టీడీపీ ఇక్కడ ఓడింది కేవలం తొమ్మిది వేల ఓట్ల తేడాతోనే. అంటే జనసేన ఓట్లు చీల్చకుండా ఉంటే ఈ సీటు టీడీపీదే. అయితే అది గతం. రేపటి రోజున టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తే ఈ సీటు కచ్చితంగా వైసీపీ కోల్పోవాల్సి ఉంటుంది అంటున్నారు. దాంతో అన్ని లెక్కలూ చూసుకునే పంచకర్ల ఇలా బయటకు వచ్చారా అన్న చర్చ అయితే ఉంది.

కాపు సామాజికవర్గం కావడంతో….

ఆయన బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన వారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వారే ఓటర్లుగా ఉన్నారు. దాంతో పాటు మంత్రి అవంతి మీద ఇటీవల కాలంలో రాసలీలల ఆరోపణలు రావడం, జగన్ గ్రాఫ్ పడిపోయింది అన్న ప్రచారం సాగడం, వైసీపీ మీద వ్యతిరేకత వచ్చింది అన్న చర్చ జరుగుతున్న నేపధ్యంలో ఇలా పంచకర్ల జూలు విదిల్చారు అంటున్నారు. మొత్తానికి ఇప్పటి నుంచే నియోజకవర్గాన్ని పట్టుకుని తిరుగుతూంటే వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉన్నా కూడా టికెట్ తనకే దక్కుతుంది అని ఆయన కొత్త ఆలోచనలు ఏవో చేస్తున్నట్లుగా ఉంది. చూడాలి మరి ఇలాంటి జనసేన వీరులు మరెక్కడ ఉద్యమిస్తున్నారో..!

Tags:    

Similar News