అనుకున్నదే… కాస్త ఆలస్యమయింది అంతే?
మధ్యప్రదేశ్ బాటలోనే రాజస్థాన్ పయనిస్తుంది. కాంగ్రెస్ ను ఎవరూ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ నేతలే చాలు. మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ [more]
మధ్యప్రదేశ్ బాటలోనే రాజస్థాన్ పయనిస్తుంది. కాంగ్రెస్ ను ఎవరూ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ నేతలే చాలు. మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ [more]
మధ్యప్రదేశ్ బాటలోనే రాజస్థాన్ పయనిస్తుంది. కాంగ్రెస్ ను ఎవరూ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ నేతలే చాలు. మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ గద్దె దిగి నెలలు కాకముందే రాజస్థాన్ లో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కలకలం మొదలయింది. ఇక్కడ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. దీంతో తాడో పేడో తేల్చుకునేందుకు సచిన్ పైలెట్ సిద్ధమయ్యారు.
విభేదాలు తీవ్రమయి…..
రాజస్థాన్ లో కాంగ్రెస్ ను విజయాల బాట పట్టించింది సచిన్ పైలెట్. దీనిని ఎవరూ కాదనలేరు. కానీ గెలిచిన తర్వాత అశోక్ గెహ్లాత్ ను పార్టీ అధిష్టానం డంప్ చేసింది. ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది. పనిలో పనిగా సచిన్ పైలెట్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. కొంతకాలం సజావుగానే ఇద్దరి మధ్య నడిచినా ఇటీవల విభేదాలు తీవ్రమయ్యాయి. అధికారుల బదిలీలు, కీలక నిర్ణయాల్లో సచిన్ పైలెట్ ప్రమేయం లేకుండా అశోక్ గెహ్లాత్ వ్యవహరించడంపై ఆయనకు మండుకొచ్చింది.
గత కొంతకాలంగా…..
ీదీంతో సచిన్ పైలెట్ గత కొంతకాలంగా ముఖ్యమంత్రిపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ మేరకు ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని కలిశారు. సచిన్ పైలెట్ చెంత 23 మంది ఎమ్మెల్యేలున్నారు. రాజస్థాన్ లో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 220. కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో కలసి మొత్తం 124 మంది సభ్యులున్నారు. బీజేపీకి మిత్రపక్షాలతో కలసి 76 మంది సభ్యులున్నారు. ప్రభుత్వం పడిపోవాలంటే 25 మంది సభ్యులు కాంగ్రెస్ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది.
రెండు ఆప్షన్లు…..
సచిన్ పైలెట్ ను తొలి నుంచి అనుమానిస్తున్న అశోక్ గెహ్లాత్ గతకొంతకాలంగా తనపై కుట్ర జరుగుతుందని చెబుతున్నారు. సచిన్ పేరును ప్రస్తావించకుండా బీజేపీ తన ప్రభుత్వాన్ని కూలదేసేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఇందుకోసం ఒక్కొక్క శాసనసభ్యుడికి 15 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయిందని ఆయన చెబుతున్నారు. కానీ సచిన్ పైలెట్ వర్గంలో ఉన్న అసంతృప్తి విషయాన్ని మాత్రం ఆయన బయటపెట్టడం లేదు. సచిన్ పైలెట్ ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజస్థాన్ లో తన పాత్రను పెంచుకోవడం, లేదంటే బీజీపీకి మద్దతిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడం. మరి సచిన్ పైలెట్ ఏ ఆప్షన్ ను ఎంచుకుంటారన్నది అధిష్టానం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.