సచిన్ పైలట్ తప్పుచేశారా?

సచిన్ పైలట్ రాజకీయంగా తప్పు చేశారా? తనకున్న శక్తిని ఎక్కువగా ఊహించుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు. జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ లో బీజేపీలోకి వెళ్లి సక్సెస్ ఫుల్ [more]

Update: 2020-07-21 17:30 GMT

సచిన్ పైలట్ రాజకీయంగా తప్పు చేశారా? తనకున్న శక్తిని ఎక్కువగా ఊహించుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు. జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ లో బీజేపీలోకి వెళ్లి సక్సెస్ ఫుల్ గా కాంగ్రెస్ పార్టీని కూలదోయగలిగారు. కానీ సచిన్ పైలట్ రాజకీయ వ్యూహం లేకుండా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. నిజానికి మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో యువనేతలకే బీజేపీ ప్రాధాన్యం ఉంటుందన్నది వాస్తవం.

మధ్యప్రదేశ్ లో చూస్తే….

మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ సీనియర్ నేత. ఆయన కూడా 70కు దగ్గరలో ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తర్వాత చరిష్మా ఉన్న నేత బీజేపీలో తక్కువగా ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ శివరాజ్ సింగ్ చౌహాన్ గెలుపు అంచుల దాకా పార్టీని తీసుకొచ్చారు. ఆయనకు త్వరలో రాజకీయ రిటైర్మెంట్ తప్పదు. అప్పుడు భవిష్యత్తు జ్యోతిరాదిత్య సింధియాదే అవుతుంది. పార్టీ దన్నుతో పాటు స్వంత ఇమేజ్ కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి అవ్వాలన్న లక్ష్యం ఎప్పటికైనా సింధియాకు నెరవేరుతుంది.

బీజేపీలో చేరనంటూ…..

ఇక రాజస్థాన్ ను తీసుకుంటే ఇక్కడ కూడా సేమ్ మధ్యప్రదేశ్ లాగానే రాజకీయ వాతావరణం ఉంది. కాంగ్రెస్, బీజేపీలే అధికారంలోకి వస్తున్నాయి. సచిన్ పైలట్ ఇప్పుడు బీజేపీలో చేరేది లేదని చెప్పారు. అలాగని కాంగ్రెస్ లో కొనసాగే పరిస్థితి కూడా కన్పించడం లేదు. ఇంత జరిగాక తిరిగి కాంగ్రెస్ లో చేరితే పక్కన ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆయన చెంత ఉండరు. భవిష్యత్ లో రాజకీయంగా దెబ్బతినాల్సి ఉంటుంది.

భవిష్యత్ ఉండేదని….

బీజేపీలో అయితే అక్కడ కూడా బీజేపీకి పెద్దగా లీడర్లు లేరు. వసుంధర రాజే ఉన్నా ఆమె కూడా 70 వయసులో పడ్డారు. సో…నిబంధనల ప్రకారం వసుంధరకు వచ్చే ఎన్నికలలో పార్టీ టిక్కెట్ కూడా ఇచ్చే అవకాశం లేదు. సచిన్ పైలట్ గుర్జర్ల వర్గం నేతగా ఎదిగారు. యువనేతగా అందరినీ ఆకట్టుకున్నారు. అదే బీజేపీలో చేరితే సచిన్ పైలట్ కు భవిష్యత్ ఉండేదని, సొంతంగా పార్టీ పెట్టినా కలసి వచ్చే అవకాశాలు తక్కువేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద సచిన్ పైలట్ రాజకీయంగా ఛాన్స్ మిస్ చేసుకున్నారన్నది అక్కడ విన్పిస్తున్న మాట.

Tags:    

Similar News