సచిన్ రివర్స్ షాట్ మామూలుగా లేదుగా..?

చూస్తుంటే సచిన్ పైలట్ కు బాగానే హామీలు దొరికినట్లుంది. యువనేత రాహుల్, ప్రియాంకలు సచిన్ పైలట్ కు భవిష్యత్ పై బాగానే భరోసా ఇచ్చినట్లు కనపడుతుంది. అందుకే [more]

Update: 2020-08-22 17:30 GMT

చూస్తుంటే సచిన్ పైలట్ కు బాగానే హామీలు దొరికినట్లుంది. యువనేత రాహుల్, ప్రియాంకలు సచిన్ పైలట్ కు భవిష్యత్ పై బాగానే భరోసా ఇచ్చినట్లు కనపడుతుంది. అందుకే సచిన్ పైలట్ నెలన్నర రోజుల అనిశ్చితికి తెరదించి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఆసరాగా నిలిచారు. ఆయన వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండి అనుకున్నది సాధించాలన్నది సచిన్ పైలట్ ఆలోచనగా ఉంది.

నెలన్నరరోజుల పాటు….

సచిన్ పైలట్ దాదాపు నెలన్నరరోజుల పాటు కాంగ్రెస్ అధిష్టానానికి, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కు నిద్ర లేకుండా చేశారు. తన వర్గం ఎమ్మెల్యేలు 18 మందితో కలసి వేరు కుంపటిని పెట్టుకున్నారు. ఆయన ఢిల్లీ వచ్చిన వెంటనే జ్యోతిరాదిత్య సింధియా మాదిరి అమిత్ షాను కలుస్తారనుకున్నారు. అలా చేయకపోగా తాను బీజేపీలో చేరబోనని ప్రకటించి కాంగ్రెస్ కే రివర్స్ షాక్ ఇచ్చారు. అయితే సొంత పార్టీ పెట్టే అవకాశముందన్న ప్రచారం కూడా బాగానే జరిగింది. కానీ సచిన్ పైలట్ ఆ పని కూడా చేయలేదు.

వ్యూహాత్మకంగానే….

మళ్లీ కాంగ్రెస్ పార్టీ నీడకే చేరిపోయారు. యువనేత సచిన్ పైలట్ వ్యూహాత్మకంగానే అడుగులు వేశారంటున్నారు. ఒకవేళ బీజేపీలోకి వెళితే తాను మళ్లీ అక్కడ సెకండ్ లెవెల్ లీడర్ గానే ఉండిపోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రాజస్థాన్ బీజేపీలో సీినియర్ నేతలు అనేక మంది ఉన్నారు. ఇక సొంత పార్టీ పెట్టాలనుకున్నా దానిని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలంటే ఏళ్లు పట్టే అవకాశముంది. అందుకే కాంగ్రెస్ లోనే ఉండి అశోక్ గెహ్లాత్ ను దెబ్బతీయాలన్న ప్లాన్ సచిన్ పైలట్ వేశారంటున్నారు.

తొలి విజయంగా….

రాజస్థాన్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గిన వెంటనే సచిన్ పైలట్ అశోక్ గెహ్లాత్ కు షాక్ ఇచ్చారు. రాజస్థాన్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి అవినాష్ పాండేను సచిన్ పైలట్ తప్పించగలిగారు. ఆయన స్థానంలో సోనియాకు అత్యంత విధేయుడైన అజయ్ మాకెన్ ను నియమించుకున్నారు. ఇది సచిన్ పైలట్ కు తొలి విజయమని ఆయన వర్గం చెబుతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి అవినాష్ పాండే పూర్తిగా గెహ్లాత్ కు అనుకూలంగా వ్యవహరించడంతోనే విభేదాలు మరింత తీవ్రమయ్యాయంటున్నారు. అందుకే ఆయన తొలి హామీని రాహుల్, ప్రియాంకలు నెరవేర్చారంటున్నారు. దీంతో పాటు సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇకపై అశోక్ గెహ్లాత్, సచిన్ పైలట్ లు కమిటీతో చర్చించిన తర్వాతనే ప్రభుత్వ, పార్టీ పరమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News