సచిన్ కు అంత సీన్ ఉందా?

రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ కు సొంత పార్టీ పెట్టి నెగ్గుకు వచ్చేంత సీన్ ఉందా? అన్న చర్చ జరుగుతోంది. సచిన్ పైలెట్ కాంగ్రెస్ పార్టీ [more]

Update: 2020-07-14 16:30 GMT

రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ కు సొంత పార్టీ పెట్టి నెగ్గుకు వచ్చేంత సీన్ ఉందా? అన్న చర్చ జరుగుతోంది. సచిన్ పైలెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లే. అయినా ఇంకా కాంగ్రెస్ పార్టీ సచిన్ పైలెట్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రంగంలోకి దిగి సచిన్ పైలెట్ ను బుజ్జగిస్తున్నారు. సచిన్ పైలెట్ వింటారా? లేదా? అన్నది పక్కన పెడితే ఒక వార్త రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తుంది.

సొంత పార్టీ పెట్టాలని…..

సచిన్ పైలెట్ సొంతంగా పార్టీ పెడతారని, జ్యోతిరాదిత్య సింధియా లా బీజేపీలోకి వెళ్లరని. తాను బీజేపీలో చేరే అవకాశం లేదని సచిన్ పైలెట్ ఇప్పటికే సన్నిహితుల వద్ద క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో విసిగిపోయిన సచిన్ పైలెట్ రాజస్థాన్ లో సొంత పార్టీ పెట్టేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి సొంతంగా సత్తా చాటాలని సచిన్ పైలెట్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

వాళ్లలాగానే…..

కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్న సక్సెస్ అయిన వారు లేకపోలేదు. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ, మహారాష్ట్రలో శరద్ పవార్, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ కాంగ్రెస్ తో విసుగుచెంది సొంత పార్టీ పెట్టుకుని సక్సెస్ అయ్యారు. వీరి బాటలోనే సచిన్ పైలెట్ పయనించాలని నిర్ణయించుకున్నారు. ప్రాంతీయ పార్టీలతోనే రాణించగలమని సచిన్ పైలెట్ గట్టిగా నమ్ముతున్నారు. అంతేకాకుండా ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టంగా మారింది.

అంత సత్తా ఉందా?

మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినా అక్కడ కాంగ్రెస్ మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయి. అయతే రాజస్థాన్ లో కూడా కాంగ్రెస్ ను ఖతం చేయాలన్నది సచిన్ పైలెట్ ఆలోచనగా ఉంది. అయితే ఇది ఎంతమేరకు ఛాన్స్ ఉంటుందన్నది కాలమే నిర్ణయించినా.. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పక తప్పదు. అక్కడ రెండు జాతీయ పార్టీలు విడతల వారీగా అధికారాన్ని చేపడుతున్నాయి. సచిన్ పైలెట్ కు అంత సత్తా ఉందా? సీన్ ఉందా? అన్నది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. మరి సచిన్ పైలెట్ సొంత పార్టీ పెట్టుకుంటారా? కాంగ్రెస్ తో కలసి పోతారా? అన్నది తేలాల్సి ఉంది.

Tags:    

Similar News