సజ్జల` అయితే..ఏంటి? ఆ మంత్రి దూకుడు
ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు సలహాదారుల రాజ్యం నడుస్తోంది. ప్రభుత్వంలో మంత్రులు ఉన్నా.. పార్టీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నా కూడా సలహాదారులే జగన్‌కు, వీళ్లకు వారధిగా ఉంటూ అన్ని [more]
ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు సలహాదారుల రాజ్యం నడుస్తోంది. ప్రభుత్వంలో మంత్రులు ఉన్నా.. పార్టీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నా కూడా సలహాదారులే జగన్‌కు, వీళ్లకు వారధిగా ఉంటూ అన్ని [more]
ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు సలహాదారుల రాజ్యం నడుస్తోంది. ప్రభుత్వంలో మంత్రులు ఉన్నా.. పార్టీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నా కూడా సలహాదారులే జగన్‌కు, వీళ్లకు వారధిగా ఉంటూ అన్ని పనులు చక్క పెట్టేస్తున్నారు. దీంతో పార్టీలో పైకి చెప్పుకోకపోయినా చాలా మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించిన అన్ని పనులు, ప్లాన్‌లను ఇటీవల కాలంలో రాజకీయ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎవరికి ఏది కావాలన్నా.. సజ్జల రామకృష్ణా రెడ్డి అనుమతి పొందాల్సి వస్తోంది. కొందరికి ఈ తరహా వ్యవహారం నచ్చడం లేదు.
మంత్రులు కూడా…..
ముఖ్యంగా ప్రజాప్రతినిధుల మాట ఎలా ఉన్నా.. మంత్రులు నేరుగా సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసి.. తమ వ్యవహారాలను వివరించాలన్న నిబంధనను పట్టించుకోవడం లేదు. పైగా లైట్ తీసుకుంటున్నారు. మేం ప్రజా ప్రతినిధులం.. ఆయన కేవలం సలహాదారు మాత్రమే అంటున్నారు. కృష్ణాజిల్లాకు చెందిన మంత్రి ఒకరు ఓ కీలక విషయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి అయితే.. ఏంటి ? ఆయన చెప్పినట్టు అంతా చేయాలంటే కుదరదు. అంటూ.. చేసిన వ్యాఖ్యలు.. వైసీపీ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. కొన్నాళ్లుగా చాలా వ్యవహారాల్లో సజ్జల చెప్పిందే వ్యూహం అన్నట్టుగా మంత్రులు కూడా చేయాల్సి వస్తోంది.
అధికారులు మాత్రం….
అయితే .. దీనిని కొందరు వింటున్నారు. మరికొందరు వినడం లేదు. ఇక, ఇప్పుడు.. ఓ కీలక విషయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి చేసి న ఆదేశాలను వినేది లేదని.. అధికారులు ఆయన మాట వింటారో.. తన మాట వింటారో చూస్తానని కూడా సదరు ఫైర్ బ్రాండ్ మంత్రి అన్నారని వైసీపీలో చర్చ జరుగుతోంది. చిత్రం ఏంటంటే.. అధికారులు ఈ ఇద్దరి మధ్య నలిగిపోతుండడమే. అటు ఆయన చెప్పింది.. వినకపోతే .. ఏకంగా ప్రధాన కార్యదర్శి నుంచి చీవాట్లు తినాలి. పోనీ.. మంత్రి చెప్పింది వినకపోతే.. నేరుగా మంత్రితో తిట్లు తినాలి.
సెలవులో అధికారులు…
ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ఓ అధికారి ఎప్పుడో ఉన్న సంక్రాంతి సెలవులను నాలుగు రోజుల కిందటే పెట్టి వెళ్లిపోయారట. అంతేకాదు.. ఈ గొడవలు తీరి.. ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాక.. అంతా సర్దు మణిగిన తర్వాత వస్తానంటూ.. ఆయన చెప్పారని ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తుండడం గమనార్హం. సజ్జల రామకృష్ణా రెడ్డి ఆయనకు అప్పగించిన పార్టీ వ్యవహారాలు, జిల్లాలతో పాటు ఓవరాల్‌గా ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ కాళ్లు, వేళ్లు పెడుతున్నారన్నదే కొద్ది రోజులుగా వైసీపీ వర్గాల్లో వినిపించే టాక్.