మంత్రి పదవిపై ఆశతో పార్టీ మారినా ఆ కల నెరవేరలేదే?
రాజకీయాల్లో నాయకులు ఒకటి తలిస్తే.. పరిస్థితులు ఒక విధంగా వారిని శాసిస్తాయి. ఎప్పుడు ఏం జరుగు తుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.. తెలంగాణలోని ఉమ్మడి [more]
రాజకీయాల్లో నాయకులు ఒకటి తలిస్తే.. పరిస్థితులు ఒక విధంగా వారిని శాసిస్తాయి. ఎప్పుడు ఏం జరుగు తుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.. తెలంగాణలోని ఉమ్మడి [more]
రాజకీయాల్లో నాయకులు ఒకటి తలిస్తే.. పరిస్థితులు ఒక విధంగా వారిని శాసిస్తాయి. ఎప్పుడు ఏం జరుగు తుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు.. ప్రస్తుత ఖమ్మం జిల్లా నేతల్లో ఇప్పటివరకు ఎవరూ సాధించని విధంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపు గుర్రం ఎక్కిన నేత సండ్ర వెంకట వీరయ్య. టీడీపీ నుంచే వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. దానికి ముందు ఒకసారి సీపీఎం నుంచి గెలుపుగుర్రం ఎక్కారు. 2018 డిసెంబరులో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ తరఫున రంగంలోకి దిగారు సండ్ర వెంకట వీరయ్య.
రెండు నియోజకవర్గాల్లో…..
2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పార్టీ తరపున గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో అందరూ పార్టీ మారిపోయినా సండ్ర వెంకట వీరయ్య ఒక్కరే ఎన్నికల నాటికి మిగిలారు. ఇక 2018 ఎన్నికల నాటికి చంద్రబాబు తెలంగాణలో పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం.. కేవలం కొన్ని స్తానాల్లో మాత్రం పోటీకి నిలబెట్టారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా బాబుకు ఘోర పరాజయం అయ్యింది. ఇలాంటివారిలో అత్యంత కీలకమైన.. ఏపీకి సరిహద్దుల్లో ఉన్న రెండు నియోజకవర్గాలు అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, సత్తుపల్లి ఈ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ విజయం సాధించింది.
పార్టీ మారిపోయి…..
అయితే, సత్తుపల్లి నుంచి గెలిచిన ఎస్సీ వర్గానికి సండ్ర వెంకట వీరయ్య. దాదాపు పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయనకు సరైన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఎలాంటి కీలక పదవులు కూడా ఆయనను వరించలేదు. టీడీపీ నుంచి రెండుసార్లు గెలిచినా రెండుసార్లు ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నారు. తనపై ఎంతో నమ్మకంతో గెలిచిన సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేకపోయారు. దీంతో ఈ దఫా అయినా పదవి దక్కుతుందనే ఆశతో ఆయన టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు. ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించిన వెంటనే కనీసం.. పార్టీ టికెట్ ఇచ్చిన చంద్రబాబు కు కూడా చెప్పకుండానే ఆయన సైకిల్ దిగిపోయి కారెక్కారు. నిజానికి గెలిచాక ప్రమాణ స్వీకారం చేసేందుకు సమయం తీసుకున్నారు. పార్టీ మారిపోయారు.
నామినేటెడ్ పదవి కూడా….
కారు పార్టీలోకి వెళ్లిన ఆయన మంత్రి పదవి కోసం ప్రయత్నించారు. అయితే, ఇదే జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్‌కు కేసీఆర్ ఛాన్స్ ఇచ్చి మంత్రి పదవిలో కూర్చోబెట్టారు. దీంతో సండ్ర వెంకట వీరయ్య తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. కనీసం నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదు. నాలుగు సార్లు గెలిచినా.. తిరుగులేని ప్రజాదరణ ఉన్నా.. తనకు పదవి దక్కక పోవడంతో సండ్ర వెంకట వీరయ్య తీవ్ర ఆవేదనలో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో ఎప్పుడు గుర్తింపు లభిస్తుందో చూడాలి.