ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అట

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరిచాలని భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై కసరత్తులు పూర్తి చేసినట్లు తెలిసింది. ఫాం హౌస్ లో కొన్నాళ్ల పాటు హోం క్వారంటైన్ [more]

Update: 2021-05-11 11:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరిచాలని భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై కసరత్తులు పూర్తి చేసినట్లు తెలిసింది. ఫాం హౌస్ లో కొన్నాళ్ల పాటు హోం క్వారంటైన్ లో ఉన్న కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణపై కసరత్తు పూర్తి చేశారంటున్నారు. ప్రస్తుతమున్న మంత్రివర్గంలో కొందరిని తొలగించి మరికొందరిని కేబినెట్ లోకి తీసుకుంటారు. అయితే ఇందులో ప్రముఖంగా విన్పిస్తున్న పేరు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.

వరస గెలుపులతో…..

సండ్ర వెంకటవీరయ్య వరసగా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేసి గెలిచారు. 2018 ఎన్నికలలో టీడీపీ గెలుచుకున్న రెండు స్థానాలు ఖమ్మం జిల్లా నుంచే అయితే వీరిద్దరినీ పార్టీలోకి తీసుకోవాలని కేసీఆర్ తొలి నుంచి ప్రయత్నాలు చేశారు. సండ్ర వెంకట వీరయ్య మాత్రం 2108 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ కు మద్దతుదారుగా మారారు. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

విలీనం కావడంతో….

అదే సమయంలో మరో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తాను టీడీపీలోనే కొనసాగనున్నట్లు తెలిపారు. కానీ ఇటీవల తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సండ్ర వెంకట వీరయ్యకు మంత్రి వర్గంలో చోటు ఖాయమని తెలుస్తోంది. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్ గా ఉన్నారు. దీంతో సండ్ర వెంకటవీరయ్యకు మంత్రి పదవి దక్కడం ఖాయమని చెబుతున్నారు.

ఎస్సీ సామాజికవర్గానికి….

సండ్ర వెంకట వీరయ్య ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే పార్టీకి అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కేసీఆర్ తన కేబినెట్ లో చోటు కల్పించారు. దీంతో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకట వీరయ్యకు మంత్రి పదవి ఖాయమంటున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సండ్ర వెంకటవీరయ్యకు ఎటువంటి పదవి దక్కలేదు. ఇప్పుడైనా మంత్రి పదవి దక్కుతుందా? లేదా? అన్నది చూడాలి.

Tags:    

Similar News