రండి…నటించండి
ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వీరు ఏం మాట్లాడతారు? ముఖ్యంగా శరద్ పవార్ ఏం చెప్పుకుంటారు? [more]
ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వీరు ఏం మాట్లాడతారు? ముఖ్యంగా శరద్ పవార్ ఏం చెప్పుకుంటారు? [more]
ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వీరు ఏం మాట్లాడతారు? ముఖ్యంగా శరద్ పవార్ ఏం చెప్పుకుంటారు? పార్టీని స్థాపించి మహారాష్ట్రలో ఎన్సీపీని తిరుగులేని శక్తిగా, మరాఠా యోధుడిగా పేరుగడించిన శరద్ పవార్ తనకు తెలియకుండానే జరిగిందని చెబుతారా? తనకు ఎటువంటి సమాచారం లేకుండానే తన సోదరుడు కుమారుడు అజిత్ పవార్ ఎమ్మెల్యేలను ఎత్తుకుని వెళ్లారని చెబుతారా? ఇది నమ్మశక్యమేనా? ఎందుకంటే శరద్ పవార్ కనుసన్నల్లోనే ఎమ్మెల్యేలు ఉంటారు. అజిత్ పవార్ పార్టీలో ఒక ముఖ్యనేత మాత్రమే కాని ఆయన శరద్ పవార్ ను వ్యతిరేకించే దమ్ము, ధైర్యం లేదు. ఎమ్మెల్యేలంతా శరద్ పవార్ ను కాదని అజిత్ పవార్ వెంట వెళతారని కూడా నమ్మలేం.
నటించడానికేనా?
కానీ మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం వేడిగా ఉన్న సమయంలో కొంత నటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో దేవెగౌడ కూడా ఇదే చేశారు. 2007 కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కుమారస్వామి బీజేపీతో పొత్తుపెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారు. అప్పడు కూడా దేవెగౌడ మీడియా ముందుకు వచ్చి ఆపసోపాలు పడ్డారు. కన్నీటి పర్యంత మయ్యారు. తన కుమారుడు తనకు తెలియకుండానే బీజేపీతో వెళ్లిపోయాడని చెప్పుకొచ్చారు. ఇదంతా అప్పటికప్పుడు నడిచిన హైడ్రామా అన్న సంగతి ఆ తర్వాత కాని తెలియలేదు.
కాపాడుకోవడానికేనా?
ఇప్పుడు శరద్ పవార్ సయితం తనకు ఏమీ తెలియదనే ఖచ్చితంగా అంటారు. నిన్నటి వరకూ శివసేన, కాంగ్రెస్ పార్టీలతో చర్చలు జరిపి ప్రభుత్వంలో భాగస్వామిని అవుతానని కూడా శరద్ పవార్ చెప్పారు. ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అని శరద్ పవార్ ప్రకటించారు. కానీ రాత్రికి రాత్రి శరద్ పవార్ సోదరుడు కుమారుడు అజిత్ పవార్ పార్టీని తీసుకుని వెళ్లిపోతారా? శరద్ పవార్ కు ఇది ముందునుంచి తెలుసునన్న అనుమానాలు కాంగ్రెస్ కూడా వ్యక్తం చేస్తుంది. ఇక ఉద్ధవ్ థాక్రే కూడా మీడియా సమావేశంలో బీజేపీ చేసిన అన్యాయం గురించి మాట్లాడవచ్చు. కానీ ఏం లాభం? నిన్నటి దాకా నువ్వు చేసిందేంటన్న ఎదురు ప్రశ్నలు రాకమానతాయా? పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే ఉద్ధవ్ థాక్రే మీడియా సమావేశంలో ఆపసోపాలు పడనున్నారు. మొత్తం మీద మహారాష్ట్ర రాజకీయాలు ఇటు రాజకీయనేతలకు, పార్టీల అభిమానులకు మంచి కిక్కును ఇచ్చాయనే చెప్పాలి.