మరాఠా నేతకు “మహా” ఛాన్స్

మరాఠా నేత శరద్ పవార్ దేశ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాలని భావిస్తున్నారు. ఎన్సీపీ అధినేత గా ఉన్న శరద్ పవార్ తృతీయ కూటమి వైపు మొగ్గు [more]

Update: 2021-04-11 16:30 GMT

మరాఠా నేత శరద్ పవార్ దేశ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాలని భావిస్తున్నారు. ఎన్సీపీ అధినేత గా ఉన్న శరద్ పవార్ తృతీయ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా శరద్ పవార్ చేసే తృతీయ ఫ్రంట్ లో అనేక మంది జట్టుకట్టే అవకాశముందంటున్నారు. ఇప్పటికే బీజేపీని కాంగ్రెస్ ఎదుర్కొనలేకపోతుంది. కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో ఇబ్బందులుపడుతుంది. నాయకత్వలేమిని కూడా కాంగ్రెస్ ను కుంగదీస్తుంది.

సోనియా ఆరోగ్య కారణాలతో…..

దీనికి తోడు సోనియాగాంధీ ఉన్నంత వరకూ మిగిలిన పార్టీలు కొంత టెన్ జన్ పథ్ వైపు చూశాయి. కానీ సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో బయటకు రాలేకపోవడం, రాహుల్ గాంధీ యువనేత కావడంతో అనేక పార్టీలు కాంగ్రెస్ కు దూరంగా జరిగాయి. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇలా ఒక్కటేమిటి ఉత్తారాదిన కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏలోకి వచ్చేందుకు ఏ పార్టీ కూడా సుముఖంగా లేదు.

యూపీఏ ఛైర్మన్ పదవిని ఇవ్వాలని….

కాంగ్రెస్ కు ఇది ఇబ్బందికరమైన పరిస్థితే. యూపీఏ చైర్ పర్సన్ గా శరద్ పవార్ ను నియమించాలన్న ఆలోచనను కూడా కాంగ్రెస్ చేసింది. సీనియర్లు కూడా కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారారు. దాదాపు 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు అధినాయకత్వంపై విమర్శలకు దిగుతున్నారు. వీరిని కట్టడి చేయలేని కాంగ్రెస్ అధినాయకత్వం పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.

అన్ని ప్రాంతీయ పార్టీల నేతలతో….

శరద్ పవార్ సారథ్యంలోని థర్డ్ ఫ్రంట్ కు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల నుంచి మద్దతు లభించే అవకాశముంది. కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకం పోవడంతో మోదీకి ధీటైన ప్రత్యర్థి శరద్ పవార్ లోనే వారు చూస్తున్నారు. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లోని అనేక ప్రాంతీయ పార్టీలను ఇప్పటికే శరద్ పవార్ తో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. అందుకే జాతీయ రాజకీయాలలో శరద్ పవార్ ఇప్పుడు ఆశాకిరణంగా కొందరికి కన్పిస్తున్నారు.

Tags:    

Similar News