పవార్ అసలు గోల్ అదేనట

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ తనకు అనుకూలంగా రాజకీయ పరిణామాలను మలుచుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత కనపడుతుంటంతో థర్డ్ [more]

Update: 2021-04-07 18:29 GMT

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ తనకు అనుకూలంగా రాజకీయ పరిణామాలను మలుచుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత కనపడుతుంటంతో థర్డ్ ఫ్రంట్ కు అవకాశాలున్నాయని శరద్ పవార్ భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ఆయన కసరత్తులు మొదలుపెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి తాను నేతృత్వం వహించాలన్నది శరద్ పవార్ ఆలోచన.

బీజేపీపైన వ్యతిరేకత….

బీజేపీ పైన దేశ వ్యాప్తంగా వ్యతిరేకత పెరిగింది. రైతులతో పాటు పేద, మధ్య, ఉద్యోగ వర్గాలు సయితం మోదీ ప్రభుత్వం పట్ల అనుకూలంగా లేవు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ పరిస్థితి మరింత దిగజారే అవకాశాలున్నాయని శరద్ పవార్ అంచనా వేస్తున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న అనేక ప్రాంతీయ పార్టీలు దేశంలో ఉన్నాయి. అయితే మోదీ బలంగా ఉండటంతో ఇప్పుడిప్పుడే వ్యతిరేక గళం విప్పే అవకాశం లేదు.

కోలుకోని కాంగ్రెస్….

మరోవైపు కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగజారుతుంది. దశాబ్దాల నుంచి ఏలిన కాంగ్రెస్ పై అనేక అవినీతి ఆరోపణలున్నాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో జట్టు కట్టడానికి ఏ ప్రాంతీయ పార్టీ ముందుకు రావడం లేదు. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, టీఆర్ఎస్, బిజూ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నప్పటికీ అవి కాంగ్రెస్ కు చేరువ కాలేకపోతున్నాయి. ఈ అవకాశాలను శరద్ పవార్ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో పడ్డారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత…..

ఇందులో భాగంగానే పశ్చిమ బెంగాల్ లో శరద్ పవార్ మమతబెనర్జీకి మద్దతు ప్రకటించారు. మమత బెనర్జీ సయితం ధర్డ్ ఫ్రంట్ కోసం చూస్తున్నారు. తాను పశ్చిమ బెంగాల్ లో గెలిచిన వెంటనే జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతానని మమత బెనర్జీ స్పష్టం చేశారు. దీంతో మమతకు మద్దతివ్వాలని శరద్ పవార్ నిర్ణయించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత శరద్ పవార్ నేతృత్వంలో తృతీయ కూటమిని ఏర్పాటు చేయాలన్న యత్నంలో శరద్ పవార్ ఉన్నారు.

Tags:    

Similar News