దినకరన్ పార్టీ సంగతేంటి?

శశికళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరి మేనల్లుడు దినకరన్ పార్టీ పరిస్థితి ఏంటన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. శశికళ రాజకీయాల నుంచి [more]

Update: 2021-03-04 17:30 GMT

శశికళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరి మేనల్లుడు దినకరన్ పార్టీ పరిస్థితి ఏంటన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. శశికళ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. శశికళ రాజకీయాలకు దూరంగా ఉంటే దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ పరిస్థితి అగమ్య గోచరంలో పడింది.

పెద్దయెత్తున వచ్చి చేరతారని….

శశికళ జైలు నుంచి విడుదలయి వచ్చిన తర్వాత పెద్దయెత్తున అన్నాడీఎంకే నుంచి వచ్చి నేతలు చేరతారని భావించారు. ఆమెకు పెద్దయెత్తున స్వాగతం లభించినప్పటికీ నేతలెవ్వరూ శశికళ చెంతకు వచ్చేందుకు ఇష్టపడలేదు. శశికళ తిరిగి అన్నాడీఎంకేకు ప్రధాన కార్యదర్శిగా అవ్వాలనుకున్నారు. ఇందుకు బీజేపీ ద్వారా కొంత ప్రయత్నాలు కూడా జరిగాయి. పన్నీర్ సెల్వం కొంత మెత్త పడినా, పళనిస్వామి మాత్రం శశికళను పార్టీలో చేర్చుకునేందుకు ససేమిరా అన్నారు.

నాల్గో కూటమికి….

శశికళ నాల్గో కూటమి పెట్టేందుకు ప్రయత్నించారు. దినకరన్ పార్టీతో కలసి ఆమె ఎన్నికలకు వెళ్లాలనుకున్నారు. కానీ డీఎంకే కూటమి బలంగా ఉంది. ఓపీనియన్ పోల్స్ అన్నీ డీఎంకే వైపే మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో నాల్గో కూటమి పెట్టి తొలిసారి తాను దెబ్బతినడం ఇష్ఠం లేక శశికళ ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. భవిష్యత్ లో అన్నాడీఎంకే దారుణంగా విఫలమై తన రాకకు నేతలు ఆహ్వానం పలుకుతారని శశికళ విశ్వసిస్తున్నారు.

పరోక్షంగా మద్దతిస్తారా?

అందుకే శశికళ రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అయితే దినకరన్ పార్టీకి చెందిన నేతలు శశికళ నిర్ణయంతో హతాశులయ్యారు. శశికళ జైలు నుంచి వచ్చిన తర్వాత పార్టీ మరింత పుంజుకుంటుందని వారు భావించారు. కానీ శశికళ నిర్ణయంతో తమ భవిష‌్యత్ ఏంటన్న ఆందోళన వారిలో ప్రారంభమైంది. అయితే శశికళ తమిళనాట అమ్మ పాలన కావాలని కోరుతున్నారు. అంటే పరోక్షంగా దినకరన్ పార్టీకి మద్దతిచ్చినట్లేనంటున్నారు. మొత్తం మీద శశికళ నిర్ణయంతో దినకరన్ పార్టీ మరింత దెబ్బతింటుందన్నది వాస్తవం.

Tags:    

Similar News