చిన్నమ్మా..రావమ్మా…. రీ ఎంట్రీ కోసం ఆహ్వానం

అందరూ ఊహించిందే. తమిళనాడులో అన్నాడీఎంకే పగ్గాలు మళ్లీ శశికళ చేపట్టనున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జరగబోయే పరిణామమిదే. ఇదే ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్. ప్రస్తుతం జరుగుతున్న [more]

Update: 2021-04-08 18:29 GMT

అందరూ ఊహించిందే. తమిళనాడులో అన్నాడీఎంకే పగ్గాలు మళ్లీ శశికళ చేపట్టనున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జరగబోయే పరిణామమిదే. ఇదే ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్. ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ఎన్నికలలో డీఎంకే వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి వచ్చేది దాదాపు కష్టమే. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాల అనంతరం శశికళ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలన్న ఆకాంక్ష అన్నాడీఎంకే నేతల్లోనే కన్పిస్తుండటం విశేషం.

జైలు నుంచి రాగానే…?

శశికళ జైలు నుంచి బయటకు రాగానే తమిళనాడు ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషిస్తారని అందరూ భావించారు. అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టేందుకు శశికళ కొద్దిపాటి ప్రయత్నాలు చేశారు. అయితే ఇవేమీ ఫలించక పోవడంతో రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు శశికళ అనూహ్య ప్రకటన చేశారు. దీని వెనక బీజేపీ పెద్దల ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో శశికళ అన్నాడీఎంకే అభ్యర్థులను గెలిపించాలని పిలుపునివ్వడం కూడా చర్చనీయాంశమైంది.

రాజకీయాలకు దూరంగానే…..

శశికళ ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.కానీ ఇటీవల ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శశికళ పార్టీలోకి వస్తే తాను ఆహ్వానిస్తాననని చెప్పారు. అంతేకాదు శశికళకు, తనకు ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు. తొలుత శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకించింది పన్నీర్ సెల్వమే. దీంతోనే శశికళ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనకు నమ్మకమైన పళనిస్వామికి ముఖ్యమంత్రి పదవి అప్పగించి జైలుకు వెళితే వారిద్దరూ ఒక్కటయ్యారు.

ఎన్నికల ఫలితాల తర్వాత….

ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం వ్యాఖ్యలు కీలకంగా మారాయి. పళనిస్వామికి చెక్ పెట్టేందుకే పన్నీర్ సెల్వం ఈ వ్యాఖ్యలు చేశారా? లేక అన్నాడీఎంకే ఓట్లు చీలకుండా కామెంట్స్ చేశారా? అన్నది హాట్ టాపిక్ అయింది. అయితే అన్నాడీఎంకే నేతల్లో ఎక్కువ మంది శశికళ రాకను స్వాగతిస్తున్నారు. మొత్తం మీద ఎన్నికల ఫలితాల తర్వాత శశికళకు అన్నాడీఎంకే పగ్గాలు అప్పగించాలన్న యోచన చాలా మందికి ఉంది. శశికళ అనుకున్నదీ అదే. మే 2తర్వాత ఎప్పుడైనా శశికళ అన్నాడీఎంకే కార్యాలయంలోకి ప్రవేశించవచ్చు.

Tags:    

Similar News