ఎందుకో అంత ఆలస్యం?
అన్నాడీఎంకే మాజీ నేత, జయలలిత సన్నిహితురాలు శశికళ డిసెంబరులోనే శిక్ష ముగించుకుని వస్తారని అంచనా వేశారు. కానీ ఆమె విడుదల కాలేదు. పూర్తి కాలం శశికళ శిక్ష [more]
అన్నాడీఎంకే మాజీ నేత, జయలలిత సన్నిహితురాలు శశికళ డిసెంబరులోనే శిక్ష ముగించుకుని వస్తారని అంచనా వేశారు. కానీ ఆమె విడుదల కాలేదు. పూర్తి కాలం శశికళ శిక్ష [more]
అన్నాడీఎంకే మాజీ నేత, జయలలిత సన్నిహితురాలు శశికళ డిసెంబరులోనే శిక్ష ముగించుకుని వస్తారని అంచనా వేశారు. కానీ ఆమె విడుదల కాలేదు. పూర్తి కాలం శశికళ శిక్ష అనుభవించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల నోట్ల రద్దు సమయంలో బయటపడిన ఆస్తుల వ్యవహారం కూడా శశికళ పీకకు చుట్టుకుందని చెబుతున్నారు. శశికళ బయటకు వస్తుందని చాలా మంది అన్నాడీఎంకేలో అసంతృప్తిగా ఉన్న నేతలు ఎదురు చూస్తున్నారు.
మూడేళ్ల నుంచి….
జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ కర్ణాటకలోనే పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శశికళ 2016లో జైలుకు వెళ్లారు. 2021లో ఆమె జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. కానీ శశికళ గత ఏడాది డిసెంబరు నాటికే సత్ప్రవర్తన కారణంగా బయటకు వస్తారని ప్రచారం జరిగింది. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ సయతం శశికళను బయటకు రప్పించేందుకు రాజకీయంగా, న్యాయపరంగా ప్రయత్నాలు చేశారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా…
అయితే దినకరన్ ప్రయత్నాలు ఫలించలేదనే చెప్పాలి. శశికళ రాకకోసం ఇటు దినకరన్ పార్టీ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలతో పాటు ఇటు అన్నాడీఎంకే నేతలు సయితం ఎదురు చూస్తున్నారు. శశికళ బయటకు వస్తే అన్నాడీఎంకేలోకి ఆమెను తీసుకురావాలని కొందరు అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు. 2021లో శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనాలంటే శశికళ నాయకత్వంలోనే వెళితే మంచిదని అధికార పార్టీకి చెందిన నేతలు బాహాటంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అన్నాడీఎంకే నేతలు…..
కానీ శశికళ ముందుగా విడుదల కాకపోవడంతో అన్నాడీఎంకే నేతలే ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పన్నీర్ సెల్వం, పళనిస్వామిల నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇప్పటికే జైలుకు వెళ్లి శశికళను కలసి వచ్చినట్లుగా కూడా చెబుతున్నారు. అయితే శశికళ సరిగ్గా ఎన్నికలకు ముందు వస్తే అన్నాడీఎంకేలోకి వచ్చినా చేసేదేమీ ఉండదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తం మీద శశికళ రాక ఆలస్యం కావడంతో రానున్న శాసనసభ ఎన్నికలపై ఆశలు పెంచుకున్న నేతలు నైరాశ్యంలోకి వెళ్లిపోయారు.