శశికళ కల తీరేట్లు లేదు
డబ్బుంది.. ఫాలోయింగ్ ఉంది. కానీ ఏం లాభం. పోటీ చేసే అవకాశమే లేదు. జయలలిత సన్నిహితురాలు శశికళకు ఎదురవుతున్న సమస్య. నిబంధనల ప్రకారం శశికళ జైలు శిక్ష [more]
డబ్బుంది.. ఫాలోయింగ్ ఉంది. కానీ ఏం లాభం. పోటీ చేసే అవకాశమే లేదు. జయలలిత సన్నిహితురాలు శశికళకు ఎదురవుతున్న సమస్య. నిబంధనల ప్రకారం శశికళ జైలు శిక్ష [more]
డబ్బుంది.. ఫాలోయింగ్ ఉంది. కానీ ఏం లాభం. పోటీ చేసే అవకాశమే లేదు. జయలలిత సన్నిహితురాలు శశికళకు ఎదురవుతున్న సమస్య. నిబంధనల ప్రకారం శశికళ జైలు శిక్ష అనుభవించడం, జరిమానా చెల్లించడం వంటివి ఆమెపోటీకి ఇబ్బంది కరంగా మారాయి. ఆరేళ్ల పాటు శశికళ పోటీకి అనర్హురాలని న్యాయనిపుణులు చెబుతున్నారు. శశికళ జైలు నుంచి విడుదలయినా ఆమె బయట నుంచి చక్రం తిప్పాల్సిందే.
ముఖ్యమంత్రి అవుదామనుకునే లోపు…
జయలలిత ఇచ్చిన అధికారాన్ని నిజానికి శశికళ పొందాల్సి ఉంది. జయలలిత ముఖ్యమంత్రిగా ఎన్నికయిన ఏడాది తిరగకుండానే మరణించారు. అన్నాడీఎంకేలో శశికళకే అప్పడు పూర్తి మద్దతు ఉంది. జయలలిత తర్వాత శశికళ ముఖ్యమంత్రి కావాల్సి ఉంది. ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనుకునేలోపు అక్రమాస్తుల కేసులో జైలు పాలయ్యారు. వెంటనే తనకు నమ్మకమైన పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేశారు. నాలుగేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించి వచ్చారు. పదికోట్ల జరిమానాను చెల్లించారు.
నిబంధనల ప్రకారం….
2021లో జరిగే ఎన్నికల్లో నిబంధనల ప్రకారం ఆమె పోటీ చేయడానికి వీలులేదు. ఇప్పటికే దినకరన్ ప్రారంభించిన పార్టీ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నుంచి పోటీ చేయాలని భావించారు. అన్నాడీఎంకేను తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నారు. కానీ నిబంధనలు శశికళకు అడ్డుగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఆరేళ్ల పాటు శశికళ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదు. అంటే ఈ ఎన్నికలే కాదు 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కూడా శశికళ దూరంగా ఉండాల్సిందే.
ఊపిరి పీల్చుకున్న…..
ఈ నేపథ్యంలో శశికళ రాజకీయ జీవితం ముగిసినట్లే నంటున్నారు. అన్నాడీఎంకే నుంచి పెద్ద సంఖ్యలో శశికళ వైపు మొగ్గుచూపుతారన్న ప్రచారం జరుగుతుంది. కాగా తాజాగా శశికళ పోటీకి దూరంగా ఉండాల్సి రావడంతో ఎవరూ అటు వైపు చూసే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో అన్నాడీఎంకే నేతలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే దీనిపై శశికళ తరుపున న్యాయవాదులు నిపుణులతో మాట్లాడుతున్నట్లు తెలిసింది.