చిన్నమ్మ శపథం నెరవేర్చుకుంటారా?

శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లేముందు శపథం చేశారు. గుర్తుండే ఉంటుంది. బయటకు ఆమె చెప్పకపోయినా తనను మోసం చేసిన వారిని వదిలపెట్టబోనని శశికళ నాడు శపథం [more]

Update: 2021-02-16 18:29 GMT

శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లేముందు శపథం చేశారు. గుర్తుండే ఉంటుంది. బయటకు ఆమె చెప్పకపోయినా తనను మోసం చేసిన వారిని వదిలపెట్టబోనని శశికళ నాడు శపథం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు శశికళ వచ్చేశారు. జైలు నుంచి వచ్చిన తర్వాత శశికళ పూర్తిగా తమిళనాడు రాజకీయాలపైనే దృష్టి సారించనున్నారు. ప్రధానంగా అన్నాడీఎంకేను తన నుంచి స్వాధీనం చేసుకున్న పళనిస్వామి, పన్నీర్ సెల్వం లను రాజకీయంగా పతనం చేయడం కోసమే నంటున్నారు.

ఎవరు గెలుస్తారన్నది కాదు…..

శశకళకు ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ముఖ్యం కాదు. అన్నాడీఎంకే మాత్రం వారి చేతిలో ఉండగా గెలవకూడదు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పాలయితే ఆటోమేటిక్ గా తన చేతికి వచ్చేస్తుందన్నది శశికళ ఆలోచన. అదే అన్నాడీఎంకే గెలిస్తే తన పరపతి, ఇమేజ్ రెండూ పోయే ప్రమాదముంది. అందుకే ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలవకుండానే శశికళ ప్రతి అడుగూ వేస్తారంటున్నారు.

న్యాయ పోరాటం ద్వారా…..

ముందుగా న్యాయపరంగా అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తారు. గుర్తు కోసం శశికళ న్యాయపోరాటం చేస్తారు. తనను అక్రమంగా ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడంపైన కూడా శశికళ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. పార్టీ నిబంధనల ప్రకారం జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికీ లేదంటున్నారు. ఇలా తొలుత శశికళ అన్నాడీఎంకే నేతలు పళినిస్వామి, పన్నీర్ సెల్వంలకు ఎన్నికల వేళ చికాకు పుట్టించనున్నారు.

ఓటమిపాలయితే…..

న్యాయపరంగా తనకు అనుకూలంగా తీర్పులు రాకున్నా శశికళ ఎన్నికల్లో మాత్రం దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని ఒంటరిగా అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తుంది. ముఖ్యంగా అన్నాడీఎంకే అభ్యర్థులు ఉన్నచోటనే ఎక్కవగా శశికళ దృష్టి పెట్టనున్నారు. దీంతో అన్నాడీఎంకే ను ఎన్నికలలో నష్టపరిచి పార్టీని తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవాలన్న యోచనలో శశికళ ఉన్నారు. ఓటమి పాలయిన వెంటనే అన్నాడీఎంకే నుంచి నేతలందరూ పళని, పన్నీర్ ను వదలి తన చెంతకు చేరతారన్న నమ్మకంతో శశికళ ఉన్నారు.

Tags:    

Similar News