Sasikala : చిన్నమ్మ గ్రిప్ లోకి వెళ్లిపోతున్నారా?
తమిళనాడు ఎన్నికల తర్వాత పదేళ్లు అధికారంలో అప్పటి వరకూ ఉన్న అన్నాడీఎంకేలో విభేదాలు తీవ్రమయ్యాయి. అన్నాడీఎంకేను ఇక నడిపించడం ఈ ఇద్దరి నేతల వల్ల కాదని తేలిపోయింది. [more]
తమిళనాడు ఎన్నికల తర్వాత పదేళ్లు అధికారంలో అప్పటి వరకూ ఉన్న అన్నాడీఎంకేలో విభేదాలు తీవ్రమయ్యాయి. అన్నాడీఎంకేను ఇక నడిపించడం ఈ ఇద్దరి నేతల వల్ల కాదని తేలిపోయింది. [more]
తమిళనాడు ఎన్నికల తర్వాత పదేళ్లు అధికారంలో అప్పటి వరకూ ఉన్న అన్నాడీఎంకేలో విభేదాలు తీవ్రమయ్యాయి. అన్నాడీఎంకేను ఇక నడిపించడం ఈ ఇద్దరి నేతల వల్ల కాదని తేలిపోయింది. ఇదే అదనుగా భావించిన శశికళ తిరిగి పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తాను తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని ఇటీవల ఆమె చేసిన ప్రకటనతో అన్నాడీఎంకేలో మళ్లీ కలకలం ప్రారంభమయింది. చిన్నమ్మ చేతిలోకి తిరిగి అన్నాడీఎంకేను అప్పగించక తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
రెండు వర్గాలుగా….
అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలుగా విడిపోయి పార్టీని అన్ని రకాలుగా నష్టపరుస్తున్నారు. ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నేత హోదా కోసం పన్నిర్ సెల్వం పోటీ పడినా, ఎమ్మెల్యేలు అధిక మంది పళనిస్వామికి మద్దతివ్వడంతో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కింది. దీంతో పార్టీలో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారు. ఈ విభేదాలు తీవ్రమవుతున్న సమయంలో శశికళ రీ ఎంట్రీ ఇచ్చారు.
తనకు అనుకూలంగా….
శశికళ జైలు నుంచి వచ్చిన తర్వాత తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు అన్నాడీఎంకే పరిస్థితిని చూసి శశికళ మళ్లీ లైన్ లోకి వచ్చారు. ఈ నెల 17వ తేదీకి అన్నాడీఎంకే ఏర్పడి యాభై సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా అన్నాడీఎంకే నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు చేయాలని నిర్ణయించారు. ఈ సమయాన్ని శశికళ తనకు అనుకూలంగా మార్చుకోనున్నారు.
ఈ ఏడాది చివరి నాటికి….
ఈ నెల 16వ తేదీన జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం శశికళ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారంటున్నారు. ఇప్పటికే శశికళ జిల్లాల్లో అన్నాడీఎంకే నేతలకు ఫోన్లు చేసి పర్యటన ఏర్పాట్లు చూడాలని పురమాయించినట్లు చెబుతున్నారు. పన్నీర్ సెల్వం, పళనిస్వామి నాయకత్వంపై నమ్మకం లేని అత్యధిక శాతం మంది నేతలు శశికళ నాయకత్వంపై మొగ్గు చూపుతారని తెలిసింది. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు ఈ ఏడాది చివరినాటికి ముగించాల్సి ఉంది. అందుకే ఈ రెండు నెలల్లో శశికళ పార్టీని తన గ్రిప్ లోకి తెచ్చుకునే ప్రయత్నాలు శశికళ మొదలుపెట్టారనే చెప్పాలి.