Sasikala : రీ ఎంట్రీకి రెడీ అయిపోయారు
తమిళనాడులోని ప్రతిపక్ష అన్నాడీఎంకే లో ఆధిపత్య పోరు ప్రారంభమయింది. ఎన్నికలు ముగిసిన మూడు నెలల నుంచి ఈ పోరు ప్రారంభమయింది. ముఖ్యనేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వల మధ్య [more]
తమిళనాడులోని ప్రతిపక్ష అన్నాడీఎంకే లో ఆధిపత్య పోరు ప్రారంభమయింది. ఎన్నికలు ముగిసిన మూడు నెలల నుంచి ఈ పోరు ప్రారంభమయింది. ముఖ్యనేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వల మధ్య [more]
తమిళనాడులోని ప్రతిపక్ష అన్నాడీఎంకే లో ఆధిపత్య పోరు ప్రారంభమయింది. ఎన్నికలు ముగిసిన మూడు నెలల నుంచి ఈ పోరు ప్రారంభమయింది. ముఖ్యనేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వల మధ్య ఓటమి తర్వాత నుంచి విభేదాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ పక్ష నేత ఎంపిక నుంచి మొదలయిన ఈ విభేదాలు పార్టీ కార్యదర్శి పదవిపై కూడా తీవ్రస్థాయిలో మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో శశికళ రంగంలోకి దిగారు.
జిల్లాల పర్యటనతో….
శశికళ ఇప్పటికే తమిళనాడులో జిల్లాల పర్యటనలను ప్రారంభించింది. తన మద్దతుదారులతో పాటు అన్నాడీఎంకే లో అసంతృప్తితో ఉన్న నేతలను కూడా తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంది. ద్వితీయ శ్రేణి నేతల నుంచి కీలక నేతలతో శశికళ సంప్రదింపులు జరుపుతున్నారు. కొందరు నేతలు చిన్మమ్మకు అండగా నిలిచేందుకు సిద్ధమయిపోయారు. తంజావూరు, మధురై లో శశికళ పర్యటనలు విజయవంతమయ్యాయి.
పన్నీర్ తో ….?
దీనికి తోడు దినకరన్ తో పన్నీర్ సెల్వం సోదరుడు రాజా భేటీ కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పన్నీర్ సెల్వం పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ గా శశికళను పార్టీలోకి ఆహ్వానిస్తే తప్పేంటని ప్రశ్నించారు. దీంతో పన్నీర్ సెల్వం శశికళను తిరిగి పార్టీలోకి తీసుకు వచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. పళనిస్వామి మాత్రం శశికళ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పళనిస్వామికి చెక్ పెట్టేందుకే పన్నీర్ సెల్వం శశికళకు మద్దతుదారుగా మారిపోయారన్న విమర్శలూ లేకపోలేదు.
బిహైండ్ బీజేపీ?
అయితే పన్నీర్ సెల్వంను వెనక నుంచి నడుపుతుంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయేనన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిని చేస్తే తిరిగి తమిళనాడులో అన్నాడీఎంకే పుంజుకుని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కొద్దోగొప్పో స్థానాలను దక్కించుకోవచ్చన్నది బీజేపీ ఆలోచన. కమలం పార్టీ స్ట్రాటజీని పన్నీర్ సెల్వం అమలు చేస్తున్నారు. దీన్ని బట్టి శశకళ పార్టీలోకి తిరిగి రావడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు.