చిన్నమ్మ రిలీజ్ డేట్ ఇదే
శశికళ త్వరలో జైలు నుంచి విడుదల అవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 27వ తేదీన శశికళ జైలు నుంచి విడుదలవుతున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. [more]
శశికళ త్వరలో జైలు నుంచి విడుదల అవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 27వ తేదీన శశికళ జైలు నుంచి విడుదలవుతున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. [more]
శశికళ త్వరలో జైలు నుంచి విడుదల అవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 27వ తేదీన శశికళ జైలు నుంచి విడుదలవుతున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల నుంచి పరప్పణ అగ్రహార జైలు లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శశికళ ముందస్తుగా విడుదల అవుతారని అందరూ భావించారు. శశికళకు పడిన జైలుశిక్షలో సెలవులు మినహాయిస్తే డిసెంబరులోనే విడుదల కావాల్సి ఉంది.
ఎన్నికల కంటే ముందుగానే…..
అయితే జైలు నిబంధనల ప్రకారం శశికళను జనవరి 27వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో జరగనున్నాయి. ఎన్నికలకు ముందే శశికళ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా శశికళ తమిళనాడులో ప్రధాన భూమిక పోషించే అవకాశముంది. అన్నాడీఎంకే నుంచి అనేక మంది శశికళ వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు.
రాత్రిపూటనే….
అయితే శశికళను జనవరి 27వ తేదీన విడుదల అవుతున్నా ఏ సమయంలో విడుదల చేయాలన్న దానిపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శశికళను రాత్రి పూట విడుదల చేయాలని భావిస్తున్నారు. పగటి పూట విడుదల చేస్తే శశికళ అభిమానులు, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ కార్యకర్తలు శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తారని ఇంటలిజెన్స్ నివేదికల హెచ్చరికలతో శశికళను రాత్రి వేళనే విడుదల చేసే అవకాశముంది.
వీరు ముందుగానే…..
అయితే ఇదే కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ సమీపబంధువులు ఇళవరసి, సుధాకరన్ లు ముందుగా విడుదలయ్యే అవకాశముంది. వీరి విడుదలకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో వారు జనవరి మొదటి వారంలో విడుదలవుతారని జైళ్ల శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద శశికళ విడుదల డేట్ తెలియడంతో పెద్దయెత్తున స్వాగత ఏర్పాట్లకు ఆమె అభిమానులు, పార్టీ కార్కకర్తలు సిద్ధమయ్యారు.