సీనియర్లే చివరకు కొంప ముంచుతారా… ?
తెలుగుదేశం పార్టీ వయసు నలభయ్యేళ్ళు. అంటే అందులో చేరిన వారు ఏనాడో షష్టి పూర్తి దాటిన వారి కిందనే లెక్క. ఇప్పటికి ఒక పది అసెంబ్లీ ఎన్నికలను [more]
తెలుగుదేశం పార్టీ వయసు నలభయ్యేళ్ళు. అంటే అందులో చేరిన వారు ఏనాడో షష్టి పూర్తి దాటిన వారి కిందనే లెక్క. ఇప్పటికి ఒక పది అసెంబ్లీ ఎన్నికలను [more]
తెలుగుదేశం పార్టీ వయసు నలభయ్యేళ్ళు. అంటే అందులో చేరిన వారు ఏనాడో షష్టి పూర్తి దాటిన వారి కిందనే లెక్క. ఇప్పటికి ఒక పది అసెంబ్లీ ఎన్నికలను సునాయాసంగా చూసేసిన వారు. పదవులు కూడా నిండా అనుభవించిన వారు. ఒక విధంగా టీడీపీకి కురు వృద్ధులు భారంగా మారిపోయారు. వీరి కోపాలు, తాపాలు ఇప్పుడు చంద్రబాబును, పార్టీని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ లిస్టులో ఉన్న నేతల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఒకరు. ఆయన తొమ్మిది సార్లు టికెట్ సంపాదించుకుని ఆరు సార్లు గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ కూడా ఉన్నారు. పార్టీ ఆయనకు ఏ విధంగానూ అన్యాయం చేయలేదు. కానీ బుచ్చయ్యచౌదరి మాత్రం తెగ గుస్సా అవుతున్నారు.
తనను పట్టించుకోవడం లేదంటూ….
అపుడే పార్టీలో చేరిన వారిలా వీరావేశం చూపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తనను పట్టించుకోవడంలేదని అంటున్నారు. నిజానికి ఆయన ఎన్టీఆర్ కాలం నాటి నుంచి పార్టీలో ఉన్నారు. చంద్రబాబు ఈడు వారు. ఇపుడు టీడీపీలో లోకేష్ నుంచి కూడా గౌరవ మర్యాదాలు ఆశిస్తున్నారు. కొత్త నీరు వస్తే పాత నీరు అలా కొట్టుకుపోతుంది. అదే తీరున టీడీపీలో యువ నాయకుడిగా లోకేష్ ఉన్నారు. ఆయనకు బుచ్చయ్య చౌదరికి జనరేషన్ గ్యాప్ ఉంది. ఎన్టీఆర్ అయితే పెద్దాయన. అపుడు చౌదరి యువకుడు. చంద్రబాబుతో వయసులో సరిసమానుడు కాబట్టి ఆ మర్యాద వేరుగా ఉండేది. కొడుకు లాంటి లోకేష్ నుంచి కూడా ఇంకా అన్నీ దక్కాలి అనుకుంటే కుదిరే వ్యవహారమేనా?
నష్టపర్చేలా…?
తెలుగుదేశం పార్టీ ఇన్ని అవకాశాలు ఇచ్చింది కదా అని ఆలొచించాల్సిన పెద్దాయన తెగ ఆవేశపడ్డారు. పార్టీ పునాదుల నుంచి ఉన్న బుచ్చయ్య చౌదరి ఈ కష్టకాలంలో పార్టీకి సరైన సలహాలు ఇచ్చి నడిపించాల్సింది పోయి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు అని తమ్ముళ్ళు అంటున్నారు. పార్టీ ఇపుడు ఎన్నడూ లేని సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. అలాంటి పార్టీని గట్టెక్కించే తీరును చూడకుండా పార్టీని నష్టపరిచేలా సీనియర్లు చూడడం దారుణమే అంటున్నారు.
కొత్తవారు వచ్చేదెప్పుడు?
బుచ్చయ్య చౌదరి లాంటి వారు చాలా మంది తెలుగుదేశం పార్టీకి గుది బండగా ఉన్నారు అన్న చర్చ కూడా వస్తోంది. ఒక్క బుచ్చయ్య మాత్రమే కాదు యనమల, అయ్యన్న, బండారు సత్యనారాయణ, యనమల లాంటి వారినే ఎప్పటికీ లీడర్లుగా ఉంచితే మరి కొత్త వారు వచ్చేదెపుడు, పార్టీ బాగుపడేది ఎపుడు అన్న మాట కూడా ఉంది. ఏది ఏమైనా ఈ గోదావరి పెద్దాయన చేస్తున్నది మాత్రం పసుపు పార్టీ కొంప ముంచే వ్యవహారమే అంటున్నారు.