తోపులను కుంటే…..?

తెలుగుదేశం పార్టీలో ఐదేళ్ల పాటు పదవులు అనుభవించి.. కొద్దోగొప్పో సంపాదించుకున్న వారు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. వారేమీ జిల్లా స్థాయి నేతలు కాదు. రాష్ట్ర స్థాయి నేతలే. [more]

Update: 2019-07-29 03:30 GMT

తెలుగుదేశం పార్టీలో ఐదేళ్ల పాటు పదవులు అనుభవించి.. కొద్దోగొప్పో సంపాదించుకున్న వారు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. వారేమీ జిల్లా స్థాయి నేతలు కాదు. రాష్ట్ర స్థాయి నేతలే. ముఖ్యంగా చంద్రబాబునాయుడు నమ్మిన వారు ఇప్పుడు పార్టీని నడిపించేందుకు ముందుకు రావడం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణ ఓటమి, పార్టీకి భవిష్యత్తు లేదన్న కారణంగా అనేక మంది నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో అనేక జిల్లాల్లో పార్టీని నడిపించేవారే లేక క్యాడర్ గందరగోళంలో పడింది.

మీసాలు తిప్పిన వారు…..

రాయలసీమను తీసుకుంటే అక్కడ మంత్రి ఆదినారాయణరెడ్డి, అఖిలప్రియ, అమర్నాధరెడ్డి, జేసీ సోదరులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఇతర పార్టీల నుంచి వచ్చినా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో పెద్ద పీట వేశారు. అయితే ఎన్నికల అనంతరం వీరు కన్పించడమే మానేశారు. జేసీ దివాకర్ రెడ్డి ఎన్నికలకు ముందే రాజకీయాల నుంచి వైదొలిగినట్లు ప్రకటించినా మిగిలిన నేతలు మాత్రం పార్టీని పక్కన పెట్టేశారు.

జిల్లాలను శాసించిన వారు….

ఇక నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణలు మంత్రులుగా ఉండి జిల్లాను శాసించారు. ఇప్పుడు మాత్రం క్యాడర్ కు అందుబాటులో లేకుండా పోయారు. అక్కడ నేతలు కూడా పార్టీ కార్యాలయానికి రావడం మానేశారు. ప్రకాశం జిల్లాలోనూ అదే పరిస్థితి. శిద్దారాఘవరావు కొంత పార్టీ కార్యక్రమాల్లో కన్పిస్తున్నా గొట్టి పాటి రవికుమార్ లాంటి నేతలు పార్టీని పట్టించుకోవడం మానేశారు.

పదవులను అనుభవించి…..

గుంటూరు జిల్లాలో మంత్రిగా పనిచేసిన నక్కా ఆనందబాబు నియోజకవర్గం ముఖం కూడా చూడటం లేదట. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పూర్తిగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రిగా పనిచేసిన పితాని సత్యనారాయణ కన్పించడం మానేశారు. ఇక అయ్యన్న పాత్రుడు అప్పుడప్పుడు మీడియాలో కన్పిస్తున్నా పార్టీ కార్యాలయానికి, కార్యకర్తల బాగోగులను కూడా పట్టించుకోవడం లేదు. దీంతో తోపులనుకుని మంత్రిపదవులు ఇచ్చిన చంద్రబాబునాయుడుకు అధికారం కోల్పోవడంతో వీరంతా హ్యాండ్ ఇస్తున్నారన్న వ్యాఖ్యలు పార్టీలో బలంగా విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News