సేనతో గోక్కుంటే అంతే?

మహారాష్ట్రలో బీజేపీ, శివసేనల మధ్య ఇంకా ఒప్పందం కుదరలేదు. ప్రభుత్వం ఏర్పాటు పై స్పష్టత రాలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు [more]

Update: 2019-10-29 18:29 GMT

మహారాష్ట్రలో బీజేపీ, శివసేనల మధ్య ఇంకా ఒప్పందం కుదరలేదు. ప్రభుత్వం ఏర్పాటు పై స్పష్టత రాలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అతి పెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ముందుకు రావడం లేదు. శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా లేదన్న సంకేతాలు పరోక్షంగా పంపుతుండటంతో శివసేన తర్వాత నిర్ణయం ఎలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది.

అతిపెద్ద పార్టీ అయినా….

మహరాష్ట్రలో 105 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 56 స్థానాలతో ఉంది. మామూలుగా అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈ అంకె సరిపోతుంది. అవసరమైన సంఖ్య కంటే ఇద్దరికీ కలిపి ఎక్కువగానే ఉంది. కానీ శివసేన తమకు సగ కాలం ముఖ్యమంత్రి పదవి, సగం మందికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న డిమాండ్ బీజేపీకి మింగుడు పడటం లేదు. పొత్తు కారణంగానే రెండు పార్టీలూ ఎక్కువ స్థానాలు సాధించినప్పటికీ ఇద్దరూ మెట్టు దిగడం లేదు.

వార్నింగ్ లతో సేన….

దీంతో శివసేన మరింత స్వరం పెంచింది. ఎన్నికలకు ముందే జరిగిన ఒప్పందం ప్రకారం చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన స్పష్టం చేస్తోంది. అంతేకాదు ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకు రాకపోతే తాము ఇతరుల సాయం తప్పకుండా తీసుకుంటామని శివసేన హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడా పొత్తు పెట్టుకుంటామని తేల్చి చెప్పింది. తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బీజేపీపై శివసేన వత్తిడి తెస్తోంది.

రేపు తేలుతుందా?

అయితే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం ముంబయి చేరుకోనున్నారు. ఆయన బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో పాల్గొననున్నారు. బీజేపీ శాసనసభ పక్ష నేతను బుధవారం ఎన్నుకోనున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేతో సమావేశమయ్యే అవకాశముంది. ఇద్దరి మధ్య అంగీకారం కుదిరితే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమవుతోంది. బీజేపీ సగం ప్రతిపాదనకు అంగీకరించకపోతే మహారాష్ట్ర రాజకీయాల్లో స్తబ్దత నెలకొనే అవకాశముంది.

Tags:    

Similar News