బిజెపి మెడపై శివసేన కత్తి ?

కులాలతో కొన్ని పార్టీలు అధికారంలోకి వస్తాయి. మతం తో మరికొన్ని. అలాంటి కోవలోకి వచ్చే శివసేన ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కార్ పీకపై కత్తిపెట్టింది. ఆ కత్తె [more]

Update: 2019-06-17 18:29 GMT

కులాలతో కొన్ని పార్టీలు అధికారంలోకి వస్తాయి. మతం తో మరికొన్ని. అలాంటి కోవలోకి వచ్చే శివసేన ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కార్ పీకపై కత్తిపెట్టింది. ఆ కత్తె రామమందిర నిర్మాణం. ఇది నిర్మిస్తామని చెప్పిన పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినా కిమ్మనకుండా ఉండటంతో శివసేనకు చిర్రెత్తికొస్తుంది. దాంతో రంగం లోకి దిగిన సేన అధినేత ఉద్ధవ్ థాక్రే తనదైన శైలిలో తమ మిత్రపక్షాన్ని టార్గెట్ చేశారు. స్వయంగా వివాదాస్పద అయోధ్య ప్రాంతాన్ని సందర్శించిన థాక్రే బిజెపి సర్కార్ కు దిశా నిర్దేశం చేయడం విశేషం.

తీసుకురండి ఆర్డినెన్స్ … కట్టండి ఆలయం …

ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కార్ కి సంపూర్ణ మెజారిటీ వుంది. ఏ పక్షం పైనా ఆధారపడాలిసిన పనిలేదు. యుపిలో లో సైతం ఆ పార్టీనే అధికారంలో వుంది. ఈ నేపథ్యంలో ఇంతకు మించిన మంచి తరుణం ఎప్పటికి ఉండదని అంచనా వేస్తుంది శివసేన. అందుకే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా తక్షణం శ్రీ రాముని ఆలయాన్ని నిర్మించాలని కోరుతుంది. మోడీ ఈ ఆర్డినెన్స్ తీసుకువస్తే ప్రపంచ వ్యాప్తంగా హిందువుల విశ్వాసాలను నిలబెట్టి వారి మద్దత్తు లభిస్తుందని హితబోధ చేస్తుంది సేన.

మోడీ నిర్ణయం ఏమిటి …?

గత ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య వివాదంలో కర్ర విరగకుండా పాము చావకుండా వ్యవహారం నడుపుకు వచ్చారు. అయితే హిందుత్వ నినాదంతో ఊగిపోతున్న కమలానికి వాస్తవంగా అయోధ్య లో శ్రీరాముని ఆలయ నిర్మాణం కత్తిమీద సాము లాంటిది. కొత్త సర్కార్ ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న నేపథ్యంలో సున్నితమైన ఈ అంశాన్ని మోడీ సర్కార్ కదిలిస్తోందా అన్నది విశ్లేషకుల్లో సందేహం. మరి కేంద్రం శివసేన డిమాండ్ ను పక్కన పెడుతుందా పరిశీలిస్తుందా అన్నది వేచి చూడక తప్పదు

Tags:    

Similar News