తొలి విక్టరీ కొట్టారే
అనుకున్నట్లుగానే మహారాష్ట్ర ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదిరింది. భారతీయ జనతా పార్టీ, శివసేనల మధ్య సీట్ల ఒప్పందం ఖరారు కావడంతో ఇక ఎన్నికల ప్రచారానికి కూటమి సమాయత్తమయింది. [more]
అనుకున్నట్లుగానే మహారాష్ట్ర ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదిరింది. భారతీయ జనతా పార్టీ, శివసేనల మధ్య సీట్ల ఒప్పందం ఖరారు కావడంతో ఇక ఎన్నికల ప్రచారానికి కూటమి సమాయత్తమయింది. [more]
అనుకున్నట్లుగానే మహారాష్ట్ర ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదిరింది. భారతీయ జనతా పార్టీ, శివసేనల మధ్య సీట్ల ఒప్పందం ఖరారు కావడంతో ఇక ఎన్నికల ప్రచారానికి కూటమి సమాయత్తమయింది. మరోసారి బీజీపీ కూటమి మహారాష్ట్రను గెలుచుకోవాలన్న లక్ష్యంతో శివసేన పార్టీతో జత కట్టింది. గత లోక్ సభ ఎన్నికల్లో రెండు పార్టీలూ కలసి క్లీన్ స్వీప్ చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతమవుతాయని రెండు పార్టీలు గట్టిగా విశ్వసిస్తున్నాయి
ఊహించింది వేరు…..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 21వ తేదీన జరగనున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా పొత్తులపై స్పష్టత లోక్ సభ ఎన్నికల సమయంలోనే వచ్చినా సీట్ల సర్దుబాబు విషయంలో అభిప్రాయబేధాలు తలెత్తుతాయని అందరూ భావించారు. శివసేన అధిక సీట్లు కోరుతుందని, బీజేపీ అందుకు అంగీకరించదని అనుకున్నారు. శివసేన నుంచి గతంలో వీడిపోయిన నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారన్న ఆగ్రహమూ శివసేనలో ఉందని, అందువల్ల సీట్ల ఖరారు విషయంలో తేడా వస్తుందని అందరూ భావించారు.
సీఎం అభ్యర్థి కూడా…
కానీ అమిత్ షా రాజకీయ చతురతతో సీట్ల సర్దుబాటు కుదిరింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తమ సీఎం అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవిస్ ను నిర్ణయించింది. శివసేన సయితం తమ పార్టీ సీఎం అభ్యర్థి అవుతారని ప్రకటించింది. రెండు పార్టీల సంకీర్ణ సర్కార్ అధికారంలోకి వస్తే బీజేపీ, శివసేన చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకునేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే తొలి సీఎం పదవి శివసేన కే అప్పగించాలని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే చర్చల్లో కోరినట్లు తెలుస్తోంది.
శివసేన అనుకున్నట్లుగానే…..
రెండు పార్టీలూ సీట్ల సర్దుబాటు వ్యవహారం సజావుగానే జరిగింది. కుదిరిన ఒప్పందం మేరకు శివసేనకు 124 స్థానాలు కేటాయించారు. సీట్ల కేటాయింపులోనే శివసేన తొలి విజయం సాధించింది. అంటే మొత్తం అసెంబ్లీ స్థానాల్లో సగానికంటే కొంచెం తక్కువ. భారతీయ జనతా పార్టీ 164 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ 164 స్థానాల్లో కూడా బీజేపీ 14 స్థానాలను తన మిత్ర పక్షాలకు ఇవ్వనుంది. బీజేపీ మిత్రపక్షాలుగా శివసేనతో పాటు రాష్ట్రీయ సమాజ్ పక్ష, రాయల్ క్రాంతి, సంఘటన్ వంటి పార్టీలున్నాయి. బీజేపీ కేవలం 150 స్థానాల్లోనే బరిలోకి దిగనుంది. సీట్ల సర్దుబాటు కుదరడంతో ఇక ప్రచారంపైనే రెండు పార్టీల నేతలు దృష్టి పెట్టారు.