సిద్దూ తగ్గు…తగ్గు…!!

సిద్ధరామయ్య బలం పుష్కలంగా ఉందని నమ్ముతున్నట్లుంది. రాష్ట్రంలో మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలని బలంగా కోరుకున్నట్లుంది. తాను రాజకీయ సన్యాసంచేస్తానని ప్రకటించిన సిద్ధరామయ్య కుమారస్వామి సర్కార్ కుప్పకూలిన తర్వాత [more]

Update: 2019-09-02 17:30 GMT

సిద్ధరామయ్య బలం పుష్కలంగా ఉందని నమ్ముతున్నట్లుంది. రాష్ట్రంలో మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలని బలంగా కోరుకున్నట్లుంది. తాను రాజకీయ సన్యాసంచేస్తానని ప్రకటించిన సిద్ధరామయ్య కుమారస్వామి సర్కార్ కుప్పకూలిన తర్వాత మరింత యాక్టివ్ గా మారారు. ఆయన సుడిగాలి పర్యటనలను చేస్తున్నారు. క్యాడర్ లో ఆత్మస్థయిర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. సిద్ధరామయ్య వ్యవహారశైలి ఎలా ఉందంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ మళ్లీ కర్ణాటకలో జెండా ఎగురవేస్తున్నంత ధీమాతో ఉన్నారు.

సక్సెస్ ఫుల్ సీఎం అయినా….

సిద్ధరామయ్య సక్సెస్ ఫుల్ ముఖ్యమంత్రిగానే పేరు తెచ్చుకున్నారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి గత శాసనసభ ఎన్నికల్లో ఆయన సారథ్యంలోనే 80 అసెంబ్లీ సీట్లను సాధించారనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు కాంగ్రెస్ పార్టీని ఘోరంగా దెబ్బతీశాయి. జనతాదళ్ ఎస్ తో పొత్తుతో ప్రభుత్వం ఏర్పడినా కాంగ్రెస్ క్యాడర్ లో సంతోషం లేదు.

తప్పిదాలు చేయడంతో…..

ఇక కర్ణాటకలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అవగాహనతో కలసి పోటీ చేయడం, లోక్ సభ ఎన్నికల్లో జనతాదళ్ ఎస్ తో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీని బాగా డ్యామేజీ చేసిందంటారు. ఎక్కడా రెండు పార్టీల క్యాడర్ కలసినట్లు కనపడలేదు. ఓట్ల బదిలీ కూడా జరగలేదు. దీంతోనే లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చిందంటారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత, కుమారస్వమి ప్రభుత్వం పడిపోయిన తర్వాత జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు వాస్తవ పరిస్థిిితిని తెలుసుకున్నాయి.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే….

అందుకే దేవెగౌడ, సిద్ధరామయ్యలు బహిరంగంగా విమర్శలు ప్రారంభించారు. మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని సిద్ధరామయ్య ఆశగా ఉన్నారు. దేవెగౌడకూడా దాదాపు ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పారు. అయితే మధ్యంతర ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ బావుకునేదేమైనా ఉంటుందా? అంటే అది ఖచ్చితంగా చెప్పలేని విషయం. కానీ సిద్ధరామయ్య మాత్రం ఫుల్ జోష్ లో ఉన్నారు. కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తెస్తానంటూ ధైర్యాన్ని క్యాడర్ కు నూరిపోస్తున్నారు. అయితే సిద్ధరామయ్యకు మాత్రం ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు సహకరించకపోవడం విశేషం. మరి ఒకవేళ ఎన్నికలువచ్చినా అది సాధ్యమేనా?

Tags:    

Similar News