ఈ మంత్రికి లోకల్ అంటే అస్సలు పడదట
ఎంత మంత్రి అయినా.. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సి ఉన్నా.. స్థానికంగా కూడా పట్టించుకుంటారు. లోకల్ పాలిటిక్స్‌పై ఎప్పుడూ.. ఒక కన్నేసి ఉంచుతారు. అంతేకాదు, స్థానికంగా ఉన్న [more]
ఎంత మంత్రి అయినా.. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సి ఉన్నా.. స్థానికంగా కూడా పట్టించుకుంటారు. లోకల్ పాలిటిక్స్‌పై ఎప్పుడూ.. ఒక కన్నేసి ఉంచుతారు. అంతేకాదు, స్థానికంగా ఉన్న [more]
ఎంత మంత్రి అయినా.. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సి ఉన్నా.. స్థానికంగా కూడా పట్టించుకుంటారు. లోకల్ పాలిటిక్స్‌పై ఎప్పుడూ.. ఒక కన్నేసి ఉంచుతారు. అంతేకాదు, స్థానికంగా ఉన్న నేతలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఎందుకంటే .. మళ్లీ మళ్లీ విజయం దక్కించు కోవాలంటే.. ఖచ్చితంగా స్థానిక నేతలను ఆదరించాల్సిన.. వారి సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఢిల్లీకి రాజు అయినా స్థానికంగా పట్టు లేకపోతే వాళ్ల పొలిటికల్ లైఫే క్లోజ్ అవుతుంది. రాష్ట్ర స్థాయిలో మంత్రులుగా ఉన్న నేతలు కూడా లోకల్‌గా ప్రజల్లో పట్టు లేక పతనమైపోయిన వారు ఎందరో ఉన్నారు. ఇది అందరికీ.. అన్ని పార్టీల నేతలకూ తెలిసిన విషయమే. అయితే.. ఉత్తరాంధ్ర మంత్రి సీదిరి అప్పలరాజుకు మాత్రం.. లోకల్ లీడర్లు, లోకల్ పాలిటిక్స్ గురించి అస్సలు ఇష్టం లేదట. ఈ మాట ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న పలాస నియోజకవర్గంలోనే.. అది కూడా వైసీపీ కేడర్లోనే వినిపిస్తోంది.
మంత్రి పదవి వచ్చిందని….
మంత్రి అప్పలరాజుని కలిసి.. తమ కష్టాలను చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్న లోకల్ లీడర్లను సదరు మంత్రి పీఏలు దగ్గరకు కూడా రానివ్వడం లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఎవరైనా నేతలు.. పట్టుబట్టి.. అప్పాయింట్‌మెంట్ దక్కించుకున్నా.. కూడా లోకల్ విషయాలు మాట్లాడొద్దని.. ముందుగానే వారికి దిశానిర్దేశం చేస్తున్నారట. మరి ఎందుకు ఇలా అప్పలరాజు మారిపోయారు ? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వస్తోంది. తాను నియోజకవర్గాన్ని జయించానని.. అందుకే తనకు మంత్రి పదవి ఇచ్చారని.. తనకు తిరుగులేదన్న భావనతో ఆయన వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు మండిపడుతున్నారు.
తొలిసారి గెలవగానే?
అయితే.. నిజానికి అప్పలరాజుకు అతిపిన్న వయసులోనే పదవి లభించింది. దశాబ్దాలుగా అక్కడ బలమైన నేతలుగా ఉన్న వారిని కాలం కలిసొచ్చి… జగన్ వేవ్‌లో ఆయన ఓడించారు. సామాజిక సమీకరణల్లో ఎవ్వరికి రానట్టుగా రెండేళ్లకే లక్ చిక్కి మంత్రి పదవి కూడా వచ్చింది. ఆ తర్వాత ఆయన వైఖరిలో పూర్తి మార్పు వచ్చిందట. ఆయన ఏదో సాధించానని ఇప్పుడే భావించడం సరికాదు. ఇంకా చాలా లైఫ్ ఉంది.. కానీ, ఆయన వైఖరి.. ఆయన పీఏలు చేస్తున్న హడావుడి చూస్తే.. మాత్రం.. రెండు మూడు సార్లు మంత్రిగా చేసిన వారికంటే కూడా ఎక్కువగానే వ్యవహరిస్తున్నారని.. ఇది పార్టీకి.. తనకు కూడా మంచిది కాదని సూచిస్తున్నారు.
మంత్రి పీఏల తోనే..?
జిల్లాలో ఉన్న మరో కీలక నేతతో పాటు మూడున్నర దశాబ్దాలుగా ఉన్న సీనియర్ నేతలను సైతం డామినేట్ చేసేలా అప్పలరాజు వ్యవహార శైలి ఉందని సొంత పార్టీ నేతలే నొచ్చుకుంటున్నారు. ఈ పరిణామం వల్ల.. కొత్తగా వచ్చేది ఏమీ లేదని.. కానీ, పోయేది మాత్రం ఎక్కువగా ఉంటుందని.. అంటున్నారు. అప్పలరాజుకు తెలియకుండానే జిల్లాలో సొంత పార్టీలో శత్రువులు ఎక్కువ అవుతున్నారు. అది పక్కన పెడితే స్థానికంగా మంత్రిగా ఆయన పలాసలో తన ముద్ర వేయాలంటే స్థానిక సమస్యలను, నేతలను పట్టించుకుంటే ఆయనకు లోకల్ గౌరవం ఉంటుందని అంటున్నారు.