సూపర్ ఛాన్స్ .. అక్కడ కొట్టడమంటే?

సిదిరి అప్పలరాజు.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన తన సమీప ప్రత్యర్థి [more]

Update: 2020-07-21 05:00 GMT

సిదిరి అప్పలరాజు.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌతు శీరీష పై దాదాపు 16వేల ఓట్ల పైచిలుకు తేడాతో గెలుపొందారు. వైద్య విద్యని అభ్యసించిన అప్పలరాజు వైసీపీ పట్ల ఆకర్షితుడై ఆ పార్టీకి దగ్గరయ్యారు. జగన్ మొన్నటి ఎన్నికల్లో ఆయనకు పలాస టిక్కెట్ ఇచ్చారు.

సాధారణ కుటుంబం నుంచి…..

అప్పలరాజుది సాధారణ మధ్యతరగతి కుటుంబం. మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన అప్పలరాజు కష్టపడి చదువుకుని వైద్య విద్యను అభ్యసించారు. పదో తరగతి నుంచి మెరిట్ మార్కులు వస్తుండంతో కొన్ని ప్రయివేటు విద్యాసంస్థలు ఆయనకు ఆర్థికంగా చేయూత నందించాయి. అలా వైద్య వృత్తిని చేపట్టిన అప్పలరాజు ప్రజల నాడిని గ్రహించి రాజకీయాల్లో ప్రవేశించి తొలిసారే సక్సెస్ అయ్యారు. పలాస నుంచి గట్టి పట్టున్న గౌతు కుటుంబంపైనే అప్పలరాజు విజయం సాధించారు.

సామాజికవర్గమే కలసొచ్చింది…

అప్పలరాజు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయనకు మంత్రి పదవి అదృష్టం వరించింది. జగన్ కేబినెట్ లో ఉన్న మోపిదేవి వెంకట రమణ రాజ్యసభకు ఎంపిక కావడంతో ఆయన స్థానంలో అప్పలరాజును కేబినెట్ లోకి తీసుకోవాని జగన్ నిర్ణయించారు. యువకుడు కావడం కూడా అప్పలరాజుకు కలసి వచ్చింది. తొలిసారి గెలిచినా నియోజకవర్గంలో ఏడాది నుంచి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో అప్పలరాజు ముందున్నారంటారు.

హేమాహేమీలున్న జిల్లాలో….

అప్పలరాజుకు వైసీపీ ఎంపీ, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ ఛార్జి విజయసాయిరెడ్డి ఆశీర్వాదాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఆయనకు మంత్రి పదవి దక్కడం మరింత సులువైంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో బలమైన ధర్మాన, తమ్మినేని కుటుంబాలకు ధీటుగా రాజకీయాలు నడిపేందుకు అప్పలరాజుకు సూపర్ ఛాన్స్ దక్కిందంటున్నారు. మొత్తం మీద ఒకేసారి ఎమ్మెల్యే అయినా అదృష్టం అప్పలరాజును అలా వరించిందంటున్నారు.

Tags:    

Similar News