కుప్పం అంత ఈజీ కాదు జగనూ?

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పరిస్థితి నువ్వా? నేనా? అన్నట్లు ఉంది. చంద్రబాబు పై పై చేయి సాధించాలని వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. టీడీపీ అధినేత [more]

Update: 2020-11-06 05:00 GMT

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పరిస్థితి నువ్వా? నేనా? అన్నట్లు ఉంది. చంద్రబాబు పై పై చేయి సాధించాలని వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ను సొంత నియోజకవర్గంలో ఇబ్బంది పెట్టేందుకు వైసీపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇది టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. కుప్పంను వైసీపీ టార్గెట్ చేయడంతో టీడీపీ కూడా అప్రమత్తమయింది. చంద్రబాబు ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

వరస విజయాలతో…..

కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు విజయం అప్రహతిహతంగా కొనసాగుతుంది. గత ఎన్నికల్లోనే చంద్రబాబు మెజారిటీ తగ్గింది. ఒకదశలో ఒక రౌండ్ లో చంద్రబాబు వెనకపడి పోవడం కూడా టీడీపీ వర్గాల్లో ఆందోళన కల్గించింది. అయితే టీడీపీ ఓటమి తర్వాత వైసీపీ కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తొలుత కుప్పంను మున్సిపాలిటీ గా చేశారు. చంద్రబాబు హయాంలో ఇది చేయలేకపోయారు.

స్పెషల్ అటెన్షన్…..

కుప్పం నియోజకవర్గంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పెషల్ అటెన్షన్ పెట్టారు. టీడీపీ నేతలను పార్టీలో జోరుగా చేర్చుకుంటున్నారు. ఇక్కడ వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ గా వనితను నియమించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను త్వరిత గతిన పూర్తి చేేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. పదిహేనేళ్లుగా పూర్తికాని కుప్పం రైల్వే అండర్ బ్రిడ్జి పనులను కూడా పూర్తి చేయాలని నిర్ణయించారు. కల్లెవంక ప్రాజెక్టు పనులు కూడా పూర్తయ్యాయి.

ఎంత ప్రయత్నించినా…..

దీంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. హంద్రీనీవా పనులను పూర్తి చేయాలని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీనికోసం పాదయాత్ర చేయాలని కుప్పం టీడీపీ నేతలు నిర్ణయించారు. దీనికి పోటీగా వైసీపీ కూడా పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని అడ్డుకుంటున్నారంటూ పోటీగా ఆందోళనకు దిగింది. కుప్పంలో పట్టు సడలిపోకుండా చంద్రబాబు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి పార్టీ నేతలతో రోజు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబుకు పట్టున్న ప్రాంతమైన కుప్పంలో వైసీపీ బలోపేతం కావడం కష్టమేనంటున్నారు పరిశీలకులు.

Tags:    

Similar News