గడపల్లోకి వెళ్లగలిగింది ఇలా?
నాయకత్వం ఊరికే రాదు. నాయకులవ్వడం అంత తేలికకాదు. అందునా అక్షరాస్యత తక్కువగా ఉన్న భారతదేశం లాంటి దేశంలో నాయకుడిగా గుర్తింపు పొందడం అంత తేలికకాదు. స్వాతంత్య్ర పోరాట [more]
నాయకత్వం ఊరికే రాదు. నాయకులవ్వడం అంత తేలికకాదు. అందునా అక్షరాస్యత తక్కువగా ఉన్న భారతదేశం లాంటి దేశంలో నాయకుడిగా గుర్తింపు పొందడం అంత తేలికకాదు. స్వాతంత్య్ర పోరాట [more]
నాయకత్వం ఊరికే రాదు. నాయకులవ్వడం అంత తేలికకాదు. అందునా అక్షరాస్యత తక్కువగా ఉన్న భారతదేశం లాంటి దేశంలో నాయకుడిగా గుర్తింపు పొందడం అంత తేలికకాదు. స్వాతంత్య్ర పోరాట చరిత్ర వారసత్వంగా తీసుకుని ప్రధాని అయిన జవహర్ లాల్ నెహ్రూకు కూడా సామాన్య ప్రజల్లో రాని గుర్తింపు కేవలం కొద్దిమంది ప్రధానులకే వచ్చింది. అప్పట్లో ఇందిరా గాంధీ, ఇప్పుడు నరేంద్ర మోడీ. దేశంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఈ రెండుపేర్లు చెప్పలేని ప్రజలు ఉండరు. దేశానికి 1947 నుండి నేటివరకూ 14మంది ప్రధానులుగా పనిచేస్తే ప్రజలందరికీ తెలిసింది ఈ ఇద్దరు ప్రధానులే.
నెహ్రూ విద్యావంతుల నేతగానే?
ఇప్పటికీ ఇందిర…..
అప్పట్లో ఇందిరాగాంధీ, ఇప్పుడు నరేంద్ర మోడీ అలాంటి పనులు చేసి ఆ గుర్తింపు సాధించారు. అయితే అప్పట్లో ఇందిరాగాంధీకి గుర్తింపు రావడానికి ప్రధాన కారణం బ్యాంకుల జాతీయీకరణ, గరీబీ హఠావో (పేదరిక నిర్మూలన) వంటి నినాదాలతో అప్పటి ఉద్దండ నేతలు కామరాజ్, నిజలింగప్ప, మొరార్జీ, నీలం సంజీవ రెడ్డి వంటి వారి నాయకత్వ నీడ చాటు నుండి నేరుగా ఎదిగారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీని చీల్చి కొత్త పార్టీ పెట్టుకుని దేశంలో ప్రతి మారుమూల ప్రాంతంలో, ప్రతి గడపకు చేరుకున్నారు. ఆమె ఇప్పటికి ఆ ఇళ్ళల్లో, ఆ నోళ్ళల్లో సజీవంగానే ఉన్నారు.
ఇన్నేళ్ల తర్వాత…..
ప్రభావితం చేయగలిగిన వారే….
మొత్తంమీద పాలకుడు ప్రజలకు తెలియాలంటే సామాన్య ప్రజల జీవితాలను ప్రభావితం చేసే చర్యలేవో చేయాలి. గరీబీ హఠావో అని ఇందిరా గాంధీ, నోట్ల రద్దు, దీపార్చన వంటి వాటితో మోడీ ఈ దేశ ప్రజల్లోకి – ప్రజల గడపల్లోకి – చేరుకున్నారు. ఇన్నేళ్ళ భారత దేశ చరిత్రలో ఇంతటి ప్రచారం పొందిన నేతలు ఈ ఇద్దరే. కారణాలు వేరైనా ప్రయోజనం ఒక్కటే – ఇద్దరూ ప్రజలకు విస్తృతంగా పరిచయం అయ్యారు.
-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్