సోమిరెడ్డి చాఫ్టర్ క్లోజ్… అస్తసన్యాసమే మిగిలిందా ?
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయింది. ఆయన రాజకీయంగా అస్త్ర సన్యాసం చేయడమే మిగిలింది. ఇది నిజం.. [more]
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయింది. ఆయన రాజకీయంగా అస్త్ర సన్యాసం చేయడమే మిగిలింది. ఇది నిజం.. [more]
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయింది. ఆయన రాజకీయంగా అస్త్ర సన్యాసం చేయడమే మిగిలింది. ఇది నిజం.. తాజాగా జరిగిన తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఏకంగా 2.71 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ ఉప ఎన్నిక బాధ్యత మొత్తం చంద్రబాబు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైనే పెట్టారు. తిరుపతి పార్లమెంటు స్థానం చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది.. కనీసం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ప్రభావం చూపలేదు సరికదా ? ఆయన సొంత నియోజకవర్గం అయిన సర్వేపల్లిలో ఎంత మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈ సెగ్మెంట్ వరకు చూస్తే వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి ఏకంగా 40 వేల ఓట్ల పై చిలుకు మెజార్టీ వచ్చింది.
1991లోనే చివరి గెలుపు…
అప్పుడెప్పుడో 1999లో సర్వేపల్లిలో చివరిసారిగా గెలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మళ్లీ గెలుపు అన్న మాటే మర్చిపోయారు. మధ్యలో కోవూరులో ఉప ఎన్నికతో కలుపుకుని సర్వేపల్లిలో మొత్తంగా నాలుగు సార్లు ఐదు సార్లు ఓడిపోయారు. ఇంత సీనియార్టీ ఉండి.. ఇన్ని సార్లు మంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకుడు వరుసగా ఐదు సార్లు ఎన్నికల్లో ఓడిపోవడం అంటే దారుణ అవమానం అనే చెప్పాలి. 2014 ఎన్నికల్లోనూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడినా తర్వాత రెండేళ్లకు చంద్రబాబు ఆయన సీనియార్టీని గౌరవించి ఎమ్మెల్సీని చేసి కేబినెట్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయన జిల్లాలో గ్రూపు రాజకీయాలను ఎంకరేజ్ చేస్తూ కాలం గడిపారే తప్ప చివరకు సొంత నియోజకవర్గంలో కూడా పార్టీని బలోపేతం చేసుకోలేకపోయారు.
ఇప్పుడు నలభై వేలు….
గత సాధారణ ఎన్నికల్లో కాకాణి గోవర్థన్ రెడ్డి చేతిలో వరుసగా రెండోసారి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో 14 వేల ఓట్ల తేడాతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోతే.. ఈ ఉప ఎన్నికల్లో అదే సర్వేపల్లిలో వైసీపీకి ఏకంగా 40 వేల ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభావం నియోజకవర్గంలో కాదు కదా.. కనీసం ఆయన సొంత మండలంలో కూడా లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇన్నేళ్ల పాటు పదవులు.. సీనియార్టీ ఉండి కూడా ఆయన రాజకీయంగా వీసమొత్తు ప్రభావం కూడా చూపలేకపోయారు.
రెస్ట్ తీసుకుంటారా?
ఇంకా సోమిరెడ్డి పార్టీలో ఉండి పదవులు పట్టుకుని వేలాడినా ఉపయోగం ఉండదన్న చర్చల కూడా వస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీరుపై చాలా మంది పార్టీ నేతలు గరంగరంగా ఉన్నారు. అయితే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నేత కావడంతో పాటు చంద్రబాబు ఆయన మాటే వింటుండడంతో ఎవ్వరూ నోరు మెదపలేదు. ఇక గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం ఒక మైనస్ అయితే.. జిల్లాలో పది సీట్లలోనూ చిత్తుగా ఓడిపోయింది. అప్పటి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టార్గెట్‌గా పలువురు పార్టీ నేతలు స్వరం పెంచుతూ వచ్చారు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలకు ఆయనే బాధ్యుడుగా ఉన్నారు. ఇక్కడ పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఒక మైనస్ అయితే.. ఆయన సొంత నియోజకవర్గంలో పార్టీ పరువు పూర్తిగా పోవడంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరింత టార్గెట్ కానున్నారు. నైతికంగా ఈ ఓటమి కూడా కలుపుకుంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇది వరుసగా ఆరో ఓటమే అవుతుంది. మరి ఇంకా ఆయన పదవుల్లో ఉంటూ పార్టీకి భారంగా మారతారా ? లేదా వచ్చే ఎన్నికల నాటికి అయినా వారసుడికి పూర్తిగా పగ్గాలు ఇచ్చేసి రెస్ట్ తీసుకుంటారా ? అన్నది చూడాలి.