సోనియా పాహిమాం.. మీరే దిక్కు

కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీ ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షురాలు. పూర్తి స్థాయి ప్రెసిడెంట్ లేరు. లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ [more]

Update: 2020-07-13 17:30 GMT

కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీ ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షురాలు. పూర్తి స్థాయి ప్రెసిడెంట్ లేరు. లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. తాను అధ్యక్షుడిగా కొనసాగలేనని రాహుల్ గాంధీ చెప్పారు. దీంతో పార్టీని నడిపించేందుకు అప్పటి వరకూ విశ్రాంతి తీసుకుంటున్న సోనియాగాంధీని తిరిగి అధ్యక్షురాలిగా కొనసాగాలని సీనియర్ నేతలు పదే పదే అభ్యర్థించడడంతో సోనియా ఓకే చెప్పక తప్పలేదు.

సీడబ్ల్యూసీ అధ్యక్షురాలిగా…..

అయితే అదే సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా కూడా సోనియా గాంధీ కొనసాగుతున్నారు. ఈ పదవీ కాలం వచ్చే నెల పదో తేదీతో ముగియనుంది. మరోసారి ఆమె సీడబ్ల్యూసీ బాధ్యతలను చేపట్టక తప్పేట్లు లేదు. ఇప్పటికే సోనియా గాంధీ ఆరోగ్య కారణాల రీత్యా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. దీంతో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశం లేక ఇబ్బందుుల పడుతుంది. చూస్తుండగానే మధ్యప్రదేశ్ ను బీజేపీ ఎగరేసుకుపోయింది.

వయసు రీత్యా…..

సోనియాగాంధీ వయసు రీత్యా ఇక రాష్ట్రాలు పర్యటించలేరు. ప్రతి రోజు సమావేశాల పేరుతో సోనియా గాంధీ తన ఆరోగ్యాన్ని చెడగొట్టుకోలేరు. కుటుంబ సభ్యులు కూడా పదే పదే సోనియాకు అదే చెబుతున్నారు. దీంతో ఆమె పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా భవిష్యత్ లోనూ పాల్గొనే అవకాశం లేదు. ఈ సంగతి సీనియర్ నేతలకు తెలియంది కాదు. అయితే ఇప్పుడు సోనియా గాంధీ తప్ప వేరే దిక్కు లేదు.

తప్పని పరిస్థితుల్లో……

తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీని సీడబ్ల్యూసీ అధ్యక్షురాలిగా కూడా కొనసాగాలని నేతలు కోరనున్నారు. పదవీకాలం పూర్తి కానుండటంతో మరోసారి ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వర్చువల్ మీటింగ్ ను పెట్టి సోనియాను తిరిగి ఎన్నుకునే అవకాశముంది. ప్రియాంకకు అనుభవం లేకపోవడం, రాహుల్ గాంధీ ఎంత చెప్పినా బాధ్యతలను చేపట్టేందుకు అంగీకరించకపోవడంతో సోనియాకు మళ్లీ పదవి చేపట్టక తప్పదు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఆమె తప్ప మరో దిక్కు లేదు.

Tags:    

Similar News