ఏమైంది ఈ సింహాలకు ….?

దశాబ్దాలం పాటు క్రికెట్ ప్రపంచానికి దూరమై ఉప్పెనలా గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన టీం దక్షిణాఫ్రికా. తమపై బ్యాన్ ఎత్తివేశాక దక్షిణాఫ్రికా సంచలనాలకు మారుపేరుగా మారింది. కెప్టెన్ హన్సీ [more]

Update: 2019-06-03 03:30 GMT

దశాబ్దాలం పాటు క్రికెట్ ప్రపంచానికి దూరమై ఉప్పెనలా గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన టీం దక్షిణాఫ్రికా. తమపై బ్యాన్ ఎత్తివేశాక దక్షిణాఫ్రికా సంచలనాలకు మారుపేరుగా మారింది. కెప్టెన్ హన్సీ క్రోనే సారధ్యంలో ప్రపంచ క్రికెట్ లో మేటి దిగ్గజాలను మట్టికరిపిస్తూ ఔరా అనిపించిన దక్షిణాఫ్రికాకు తీరని కల ప్రపంచకప్ ను సాధించడం. అనేక సార్లు తమ దేశానికి కప్ ను సాధించాలని ఆ టీం సెమి ఫైనల్స్ వరకు వెళ్ళి చతికిల పడటం రీవాజు గా వచ్చింది. లీగ్ దశలో అత్యంత భీకరంగా చెలరేగి ఆడి కీలక దశలో చేతులు ఎత్తేయడంతో కప్ సాధిస్తుందని అంచనాలు వేసిన ప్రతీ సారి సౌత్ ఆఫ్రికన్ ఫ్యాన్స్ ను నిరాశపరుస్తూనే ఆ టీం వెనుదిరిగేది.

వరుస ఓటములతో ఈసారి ….

ఈసారి ప్రపంచ కప్ కి ఎప్పటిలాగే గట్టి సన్నాహాలు చేసుకుని రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆడిన తొలి రెండు మ్యాచ్ లలో చతికిల పడి అందరిని నిరుత్సాహ పరిచింది. టోర్నీ హాట్ ఫేవరెట్స్ లో ఒకటైన టీం ఇలాగైనా ఆడేది అన్న అపప్రధను మూటగట్టుకుంది. తొలి రెండు మ్యాచ్ లలో ఓటమి అంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ గెలుస్తూ సాగితే కానీ తమ ఆశలను సజీవంగా నిలుపుకోలేదు. అదేవిధంగా వచ్చే మ్యాచ్ లలో తీవ్ర ఒత్తిడితో ప్రత్యర్థిని ఎదుర్కొవాలిసి ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్నప్పటికీ డుప్లెసిస్, హసీం ఆమ్లా, డీ కాక్, మిల్లర్ లు బ్యాటింగ్ లోను స్టైన్, తాహిర్ లు బౌలింగ్ లోను అద్భుతాలు సృస్ట్టించే స్టార్ ప్లేయర్ లే. కానీ వారిని దృరదృష్టం వెన్నాడుతుందా లేక ఒక టీం గా రాణించలేక చతికిల పడుతుందా? అన్నది లెక్క తేలడం లేదు. ఇంగ్లాండ్ తో తొలి మ్యాచ్ ను, బంగ్లా దేశ్ తో రెండో మ్యాచ్ ను వరుసగా కోల్పోయి నిరాశలో పడింది సౌత్ ఆఫ్రికా.

ఒకనాటి భీకర టీం …

విమాన ప్రమాదంలో మరణించిన ఒకనాటి మేటి క్రికెటర్ హన్సీ క్రోనే సారధ్యం లో అద్భుతంగా తమ ప్రస్థానం సాగించింది సౌత్ ఆఫ్రికా. నాటి టీం లో చివరి ఆటగాడు వరకు మ్యాచ్ విన్నర్లే. షాన్ పొలాక్, అలెన్ డోనాల్డ్ వంటి వారి బౌలింగ్ అంటే ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ కి చెమటలు పట్టేవి. ఇక స్టార్ బ్యాట్స్ మెన్ కలిస్, గిబ్స్ వంటి వారు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే వారు. ఆల్ రౌండర్ లకు దక్షిణాఫ్రికా పెట్టింది పేరుగా ఉండేది. ఇక జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ లో కొత్త అధ్యాయాన్ని ప్రపంచ క్రికెట్ కి అందించిన వాడు. టీం లో దాదాపు అరడజనుకు పైగా ఆల్ రౌండర్లతో దుర్భేద్య జట్టుగా రాణించేది సౌత్ ఆఫ్రికా. ఎప్పుడైతే హన్సీ సారధ్యంలో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం దక్షిణాఫ్రికా జట్టును చుట్టుముట్టిందో చాలా కాలం ఆ నీలినీడలు జట్టు విజయాలపైనా ప్రభావం చూపాయి. ఆ తరువాత కాలంలో కలిస్ , పొలాక్ వంటివారు టీం కి గుడ్ బై కొట్టాక సౌత్ ఆఫ్రికా టీం మసకబారుతు వచ్చింది.

పుంజుకుంటుందా ….?

ఒక్కసారైనా ప్రపంచ కప్ అందుకొని దేశాల్లో దక్షిణాఫ్రికా కూడా ఒకటి. వరల్డ్ కప్ టోర్నీలు మొదలు అయినప్పుడల్లా ఈసారైనా తమ టీం కప్ తెస్తుందేమో అని ఆ దేశ ఫ్యాన్స్ ఆశగా చూడటం వారి ఆశలు నీరుగారిపోవడం రొటీన్ అయిపొయింది. ఎప్పుడు టోర్నమెంట్ చివరి దశలో భారంగా నిష్క్రమించే సౌత్ ఆఫ్రికా ఈసారి ఇంగ్లాండ్ లో ముందే వరుసగా రెండు ఓటములు కొని తెచ్చుకోవడంతో ఇప్పుడు పెద్దగా అంచనాలు లేని అనామక జట్టుగా విశ్లేషకులు అంచనా వేసే పరిస్థితికి చేరిపోయింది. బుధవారం భారత్ తో లీగ్ లో తన మూడో మ్యాచ్ ఆడబోతున్న సౌత్ ఆఫ్రికాకు ఇప్పుడు చావో రేవో అన్న దుస్థితి ఎదురైంది. టోర్నీ లో తమ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే సౌత్ ఆఫ్రికా జైత్ర యాత్ర మొదలు పెట్టాలి. అది టీం ఇండియా పై అంత ఈజీ కాదన్నది క్రీడా విశ్లేషకుల అంచనా. టోర్నీ తొలి మ్యాచ్ ఆడబోతున్న ఇండియా కు దక్షిణాఫ్రికా బలం, బలహీనతలపై పూర్తి అంచనా వుంది. ప్రపంచ క్రికెట్ లో మేటి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ భారత్ కు ఉండటం ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే అత్యుత్తమ బ్యాట్స్ మెన్ డుప్లెసిస్ వరుస ఓటములతో రగిలిపోతున్నాడు. ఇరు జట్లపై ఇప్పుడు గట్టి వత్తిడి వుంది. దాంతో ఈ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ గా సాగే ఛాన్స్ లే అధికం.

Tags:    

Similar News