నిర్లిప్తత.. నియంత్రణ లేమి.. ఫలితం.. భారీ మూల్యం

జనాభా తక్కువే. వసతులు ఎక్కువే. కానీ ఏం లాభం? నియంత్రణ లేకపోవడంతో భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. స్పెయిన్ ఇప్పుడు కరోనా వైరస్ తో వణికి పోతోంది. [more]

Update: 2020-04-01 18:29 GMT

జనాభా తక్కువే. వసతులు ఎక్కువే. కానీ ఏం లాభం? నియంత్రణ లేకపోవడంతో భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. స్పెయిన్ ఇప్పుడు కరోనా వైరస్ తో వణికి పోతోంది. స్పెయిన్ ప్రిన్సెస్ కరోనాకు బలయిపోయారు. స్పెయిన్ ప్రిన్సెస్ మారియా థెరిసా కరోనా చికిత్స పొందుతూ మరణించారు. స్పెయిన్ లో ఇప్పటికే వందలాది మంది కరోనా వ్యాధితో బాధపడుతున్నారు. అనేక మంది మరణించారు. ప్రిన్సెస్ మరణంతో స్పెయిన్ లో ఆందోళన వ్యక్తమవుతోంది.

చిన్న దేశం తాత్సారం…

నిజానికి చిన్న దేశం తాత్సారం చేసింది. ప్రపంచమంతా కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకున్నా స్పెయిన్ మాత్రం అందులో మీనమేషాలు లెక్కించింది. దీంతో కరోనా వైరస్ నేరుగా రాజప్రసాదంలోకే ప్రవేశించి రాజకుమారిని కబళించింది. ఒక్కరోజులోనే స్పెయిన్ లో దాదాపు 900 మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రికార్డు స్థాయిలో స్పెయిన్ లో మరణాలు సంభవిస్తుండటంతో ప్రబుత్ంలో ఆందోలన మొదలయింది.

రోజుకు వేల సంఖ్యలో…..

స్పెయిన్ ఇటలీని దాటిపోతుందన్న ఆందోళన ఆ దేశవాసుల్లో వ్యక్తమవుతోంది. రోజుకు దేశ వ్యాప్తంగా ఏడువేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఐదు కోట్లలోపే ఉన్న జనాభా కావడంతో లాక్ డౌన్ కూడా సక్రమంగా పాటించలేదు. పబ్ ల్లోనే ఎక్కువ సమయం గడపడం, విదేశాల నుంచి వచ్చిన వారిని సరిగ్గా పరీక్షలు చేయకపోవడం వంటి వాటి కారణంగానే స్పెయిన్ భారీ మూల్యం చెల్లించుకుంటోందంటున్నారు.

మరణాల సంఖ్య కూడా….

స్పెయిన్ లో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే ఏడు వేలు మరణాల సంఖ్య దాటింది. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కాకుండా దాదాపు 80 వేల మందికి పైగానే స్పెయిన్ వాసులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో స్పెయిన్ ప్రభుత్వం ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను రప్పిస్తోంది. నాలుగో ఏడాది మెడిసిన్ చదువుతున్న వారి సేవలను కూడా వినియోగించుకుంటోంది. మొత్తం మీద నిర్లక్ష్యం, నిర్లిప్తత స్పెయిన్ ఉసురుతీస్తుందనే చెప్పాలి.

Tags:    

Similar News