ఎక్కడైనా స్పీకర్ అంతేనా…?

అసెంబ్లీ స్పీక‌ర్‌. రాజ్యంగంలోని ఆర్టిక‌ల్స్ 178 నుంచి 187 వ‌ర‌కు స్పీక‌ర్ నియామ‌కం, ఆయ‌న విధులు, అధికారాల‌ను స్పష్టం చేస్తున్నాయి. స‌భ‌లో ఎలా వ్యవ‌హ‌రించాలి? ఎలాంటి నిర్ణయాలు [more]

Update: 2019-07-16 00:30 GMT

అసెంబ్లీ స్పీక‌ర్‌. రాజ్యంగంలోని ఆర్టిక‌ల్స్ 178 నుంచి 187 వ‌ర‌కు స్పీక‌ర్ నియామ‌కం, ఆయ‌న విధులు, అధికారాల‌ను స్పష్టం చేస్తున్నాయి. స‌భ‌లో ఎలా వ్యవ‌హ‌రించాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకునే హ‌క్కు ఆయ‌న‌కు ఉంది అనేది స్పష్టంగా ఈ ఆర్టిక‌ల్స్ పేర్కొంటున్నాయి. లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీక‌ర్‌కు రాజ్యాంగం ప్రసాదించిన హ‌క్కులు ఇవి. అయితే, గ‌డిచిన రెండు సంవ‌త్సరాలుగా దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. రాజ్యాంగం ప్రసాదించిన ఈ హ‌క్కుల‌ను ఆయా స్పీక‌ర్లు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో.. తెలుస్తుంది. కొన్ని చోట్ల ఈ హ‌క్కులు, ఆర్టిక‌ల్స్ ద్వారా సంక్రమించిన అధికారాలు అమ‌లుకు నోచుకోక పోవ‌డం గ‌మ‌నార్హం.

బాబు హయాంలోనూ….

ఏపీలో జ‌రిగిన విష‌యాన్నే తీసుకుంటే.. గ‌తంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్న స‌మ‌యంలో ప్రతిప‌క్షం వైసీపీని అంతం చేయాల‌నే దురుద్దేశంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల‌ను ఫిరాయించేలా ప్రోత్సహించారు. ఈ క్రమంలో అలా ఫిరాయించిన వారిపై వేటు వేయాలంటూ. అప్పటి స్పీక‌ర్ కోడెల శివ‌ప్రసాద‌రావుకు వైసీపీ విజ్ఞప్తి చేసింది. అనేక మార్లు ద‌ర‌ఖాస్తులు కూడా స‌మ‌ర్పించింది. ఆయ‌న స్పందించ‌క పోయే స‌రికి స‌భ‌లోనూ ఈ విష‌యాన్ని ప్రస్థావించింది. అయినా కూడా స్పీక‌ర్ స్పందించ‌క పోవ‌డంతో విష‌యాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.. వైసీపీ నాయ‌కులు. ఈ క్రమంలో ఈ కేసు అటు కోర్టులోను తేల‌లేదు.. ఇటు.. స‌భ‌లోనూ తేల‌లేదు. మొత్తానికి ఐదేళ్ల ప‌ద‌వీ కాలం మాత్రం పూర్తి అయిపోయింది.

కర్ణాటకలో సయితం….

ఇక‌, ఇప్పుడు ఏపీకి ప‌క్కనే ఉన్న క‌ర్ణాట‌క‌లో జ‌రుగుతున్న రాజ‌కీయాల విష‌యాన్ని చ‌ర్చిద్దాం. ఇక్కడ కూడా రాజ‌కీయ సంక్షోభం త‌లెత్తింది. ప్రభుత్వంలోని ప‌లువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు .. త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. దీనిపై స్పీక‌ర్ ర‌మేష్ కుమార్ నిర్ణయం తీసుకోవాలి. అయితే, ఎమ్మెల్యేలు త‌గిన ఫార్మాట్‌లో రాజీనామా చేయ‌లేద‌ని, త‌న కార్యాల‌యానికి నేరుగా రాకుండా పోస్టులో వీటిని పంపార‌ని పేర్కొన్న ఆయ‌న వీటిపై నాన్చుడు ధోర‌ణి అవ‌లంబించారు. దీంతో కొంద‌రు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఏపీలో వ‌చ్చినతీర్పు మాదిరిగానే “విష‌యం ఎలాగూ స్పీక‌ర్ నోటీసులో ఉంది కాబ‌ట్టి మేం జోక్యం చేసుకోం“-అని సుప్రీం కోర్టు వెల్లడిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

సుప్రీంకోర్టు జోక్యంతో….

అయితే, దీనికి విరుద్ధంగా కోర్టు 24 గంట‌ల్లో నిర్ణయం తీసుకోవాల‌ని సూచించి సంచ‌ల‌నానికి తెర‌దీసింది. దీంతో స్పీక‌ర్ ర‌మేష్.. ఈ తీర్పును అమ‌లు ప‌రిచేందుకు విముఖ‌త వ్యక్తం చేశారు. రాజ్యాంగం త‌న‌కు ప్రసాదించిన హ‌క్కుల‌ను కోర్టు ఎలా ప్రశ్నిస్తుంద‌ని అన్న ఆయ‌న దీనిపై త‌న‌కు న‌చ్చిన‌ప్పుడు పూర్తిగా విచారించి నిర్ణయం తీసుకుంటాన‌ని చెబుతూనే.. కొంత ఆవేశంగా.. “న‌న్ను ప్రశాంతంగా చావ‌నివ్వండి“ అని వ్యాఖ్యానించారు. దీనిపైనా సుప్రీం సీరియ‌స్ అయింది. మేం చెబితే నువ్వు చెయ్యవా? కోర్టు క‌న్నామీరే ఎక్కువా? అనినిల‌దీసింది. మొత్తానికి ఈ విష‌యం ఇప్పుడు దేశమంతా చ‌ర్చ న‌డుస్తోంది. ఏదేమైనా.. పాల‌కులు త‌మ‌కు అనుకూలంగా స్పీక‌ర్ పీఠాన్ని నిర్ణయిస్తున్నార‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి.

Tags:    

Similar News