ఇక అవి ఒక్కటే మిగిలాయి..వాటిని కూడా కానిచ్చేయండి

కరోనా వైరస్ వ్యాప్తి భారత్ లో ఏమాత్రం ఆగడం లేదు. యాభై లక్షలకు చేరువలో ఉన్నాయి. ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరిపోయింది. బ్రెజిల్ ను దాటేసింది. అయినా [more]

Update: 2020-09-14 18:29 GMT

కరోనా వైరస్ వ్యాప్తి భారత్ లో ఏమాత్రం ఆగడం లేదు. యాభై లక్షలకు చేరువలో ఉన్నాయి. ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరిపోయింది. బ్రెజిల్ ను దాటేసింది. అయినా భారత్ మాత్రం లాక్ డౌన్ మినహాయింపుల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుం 4.0 అన్ లాక్ విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బార్లు, సినిమా థియేటర్లు తప్ప దాదాపు అన్నింటికి అనుమతిచ్చేసింది.

సినిమా థియేటర్లు కూడా….

సినిమా థియేటర్లు కూడా దాదాపు ఆరు నెలల నుంచి కరోనా కారణంగా మూతబడే ఉన్నాయి. ఇటీవలే అన్ లాక్ 4.0లో భాగంగా సినిమా షూటింగ్ లకు అనుమతి ఇచ్చారు. ఇక థియేటర్లకు కూడా అనుమతించాలని కోరుతున్నారు. ఇప్పటికే ఓటీటీ ద్వారా కొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. వాటికి ప్రజలు అలవాటు పడితే జనం సినిమా థియేటర్లకు రారని బెంగ పట్టుకుంది. అందుకే త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వాలను ఎక్కడికక్కడ కోరుతున్నాయి.

మెట్రోకు అనుమతి…..

జనం సమూహంగా ఉండే అన్నింటికీ ఇప్పటికే అనుమతులు ఇచ్చేశారు. మెట్రో సర్వీసులు ఇప్పుడు తిరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మెట్రో సర్వీసులను నడుపుతున్నారు. అయితే ప్రజల నుంచి వీటికి పెద్దగా ఆదరణ లేకపోలేదు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో మెట్రో పరిస్థితి అలాగే ఉంది. ఇక సినిమా థియేటర్లు కూడా ప్రారంభమయినా ప్రజలు అంత త్వరగా వచ్చే అవకాశమే లేదు.

అన్ లాక్ పేరిట…..

కరోనా కేసులు పెరుగుతున్నా అన్ లాక్ పేరుతో అన్నింటికి అనుతులు ఇస్తుండటం విమర్శలకు తావిస్తుంది. దాదాపు నలభై రోజుల పాటు లాక్ డౌన్ విధించి కష్టనష్టాలకు ఓర్చినా ఒక్కసారిగా అన్ లాక్ తో అన్నింటికి ద్వారాలు తెరవడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక విద్యాసంస్థలు మాత్రమే తెరవాల్సి ఉంది. వాటిని మాత్రం ప్రభుత్వం ఇంతవరకూ అనుమతించలేదు. ఇప్పటికే కరోనాకు ప్రజలు అలవాటు పడిపోయారు. కరోనా కేసులు పెరుగుతున్నా ప్రజలు కూడా భయం లేకుండా బయట తిరుగుతున్నారు. అన్ లాక్ 5తో ఇక అంతా మామూలయిపోతుంది. కరోనా వచ్చినవాడికి వస్తుంది. రాని వాడికి రాదు. అదే పాలసీతో జనం బతకాల్సిందే.

Tags:    

Similar News