టీడీపీ ఎమ్మెల్యేను ఢీకొట్టేందుకు.. వైసీపీలో నాలుగు గ్రూపులు
శ్రీకాకుళం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీకి బలమైన జిల్లాగా ఉన్న ఇక్కడ పాగా వేసేందుకు వైసీపీ నాయకులు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ సునామీ జోరు ఎక్కువగా [more]
శ్రీకాకుళం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీకి బలమైన జిల్లాగా ఉన్న ఇక్కడ పాగా వేసేందుకు వైసీపీ నాయకులు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ సునామీ జోరు ఎక్కువగా [more]
శ్రీకాకుళం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీకి బలమైన జిల్లాగా ఉన్న ఇక్కడ పాగా వేసేందుకు వైసీపీ నాయకులు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ సునామీ జోరు ఎక్కువగా ఉన్నప్పటికీ.. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. ఇక్కడ నుంచి బెందాళం అశోక్ వరుసగా రెండోసారి విజయం సాధించారు. ఇదే జిల్లాలో ఇచ్ఛాపురంతో పాటు టెక్కలిలోనూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విజయం సాధించారు. టెక్కలిలో అచ్చెన్నను కంట్రోల్ చేసేందుకు జగన్ అదే నియోజకవర్గానికి చెందిన ముగ్గురు నేతలకు పార్టీలో కీలక పదవులు కట్టబెట్టారు. అయితే ఈ ముగ్గురు నేతల గ్రూపుల గోలతో టెక్కలి వైసీపీ ఎలా చీలికలు పీలికల మాదిరిగా మారిపోయిందో ఇప్పుడు ఇచ్ఛాపురంలోనూ అదే పరిస్థితి.
నలుగురు పోటీ పడుతుండటంతో….
టీడీపీకి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో గెలుపు గుర్రం ఎక్కి వైసీపీ జెండా పాతేందుకు ఆ పార్టీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్క టీడీపీ నేతను ఢీకొనేందుకు వైసీపీకి చెందిన నలుగురు నేతలు పోటీ పడుతుండడం గమనార్హం. ప్రస్తుతం డీసీఎంఎస్ చైర్మన్ గా ఉన్న పిరియా సాయిరాజ్‌తోపాటు.. కాయల వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్, నర్తు రామారావు యాదవ్లు ఇక్కడ పోటీ చేయాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తర ఫున పిరియా సాయిరాజ్ పోటీ చేశారు. 71931 ఓట్లు కూడా సాధించారు. అయితే అశోక్ 4 వేల ఓట్ల మెజార్టీతో వరుసగా రెండోసారి గెలిచారు. ఎన్నికల్లో ఓడిన సాయిరాజ్‌కు జగన్ డీసీఎంఎస్ చైర్మన్ పదవిని కూడా కట్టబెట్టారు. అయినా ఆయన వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదు.
పార్ట్ టైం గా వచ్చి…..
ప్రస్తుతం కవిటి మండలంలో ఉంటున్న సాయిరాజ్.. వచ్చే ఎన్నికల నాటికి ఇచ్చాపురం నుంచి మళ్లీ పోటీ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక, వైసీపీలో కీలక నేతగా ఉన్న కాయల వెంకట రెడ్డి కూడా ఇచ్చాపురం టికెట్ రేసులో ముందున్నారు. నిజానికి 2019 ఎన్నికల్లోనే వెంకటరెడ్డి ఇచ్చాపురం టికెట్ ఆశించారు. వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో స్టాట్యూ కట్టించి.. పార్టీలో ప్రత్యేక గుర్తింపు కూడా సాధించారు. అయితే.. విశాఖపట్నానికి చెందిన వెంకటరెడ్డికి ఇక్కడ టికెట్ ఇస్తారా ? అనేది సందేహంగా ఉన్నప్పటికీ.. ఆయన ప్రయత్నం మాత్రం ఆగడం లేదు. విశాఖ నుంచి పార్ట్ టైం మాత్రమే ఆయన ఇచ్ఛాపురంకు వచ్చి వెళుతుంటారు.
పార్టీ ఇమేజ్……
మరోవైపు మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్ కూడా తన ప్రయత్నం తాను చేస్తున్నారు. ఇక, కవిటి మండలానికి చెందిన నర్తు రామారావు యాదవ్ కూడా ఇచ్చాపురం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ వైసీపీ తరఫున నలుగురు పోటీలో ఉండడం గమనార్హం. వీరిలో ఎవరికి వారు గ్రూపులు మెయింటైన్ చేస్తూ ఇచ్ఛాపురం వైసీపీని పీలికలు చేసి పడేస్తున్నారు. అందుకే ప్రస్తుత ఇన్‌చార్జ్ సాయిరాజ్ డీసీఎంఎస్ పదవితో పాటు పార్టీ అధికారంలో ఉండి కూడా బలం పుంజుకోవడం లేదు. ఏదేమైనా టీడీపీలో ఒకే ఒక్కటిగా పోరాటం చేస్తోన్న అశోక్‌ను ఢీకొట్టేందుకు వైసీపీలో నలుగురు నేతలు నాలుగు గ్రూపులుగా పోరాటం చేస్తుండడంతో పార్టీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతోంది.