స్టాలిన్ పాతుకుపోతారా?

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. పగలు, ప్రతీకారాలతో రగిలిపోతూ ఉంటాయి. కానీ గత రెండు నెలలుగా తమిళనాడు రాజకీయంగా ప్రశాంతంగా ఉంది. దానికి [more]

Update: 2021-07-17 16:30 GMT

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. పగలు, ప్రతీకారాలతో రగిలిపోతూ ఉంటాయి. కానీ గత రెండు నెలలుగా తమిళనాడు రాజకీయంగా ప్రశాంతంగా ఉంది. దానికి కారణం ముఖ్యమంత్రి స్టాలిన్ అని చెప్పక తప్పదు. స్టాలిన్ తనకు మరో దశాబ్దకాలం పాటు ఎదురు లేకుండా చేసుకునేలా పాలనను ప్రారంభించారు. ఇలాగే కొనసాగితే స్టాలిన్ కు విపక్షాల నుంచి ఎటువంటి ముప్పు ఉండదన్నది విశ్లేషకుల అంచనా.

స్టయిల్ మార్చి…

స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన స్టయిల్ ను మార్చారు. పగలు, ప్రతీకారాలను పూర్తిగా వదిలేశారు. విపక్షాలను సయితం పరిగణనలోకి తీసుకుని వారి సలహాలతో పాలనను సాగిస్తున్నారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ప్రతి నిర్ణయం వెనక విపక్షాల పాత్ర ఉండేలా చూసుకుంటున్నారు. తనకు శత్రువులుగా ఉన్న వారిని సయితం మిత్రులుగా మార్చుకోవడలో స్టాలిన్ సక్సెస్ అయ్యారనే అంటున్నారు.

అంతా లైన్ క్లియర్ ….

తమిళనాడులో ఇప్పుడిప్పుడే ఎన్నికలు లేవు. కమల్ హాసన్ పార్టీ పూర్తిగా కనుమరుగయిపోయింది. రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి రానని చెప్పేశారు. ఇక స్టాలిన్ కు ఉన్న ఒకే ఒక ప్రత్యర్థి అన్నాడీఎంకే మాత్రమే. అన్నాడీఎంకే లో నాయకత్వ సమస్య తీవ్రంగా ఉంది. ఒకవేళ శశికళ చేతిలో పార్టీ పగ్గాలు వెళ్లినా ఆమె స్టాలిన్ ను ఎదుర్కొనేంత శక్తి లేదన్నది వాస్తవం. కోటరీ, గ్రూపు తగాదాలతో ఆ పార్టీ మరో ఐదేళ్ల పాటు ఇబ్బందులు పడాల్సిందే.

ప్రత్యర్థులు లేకుండా…?

అందుకే స్టాలిన్ మరోసారి తన అధికారాన్ని నిలుపుకునేందుకు సీఎం కుర్చీ ఎక్కిన రోజు నుంచే ప్రారంభించారు. ఒకరకంగా చెప్పాలంటే స్టాలిన్ వైఖరి అన్నాడీఎంకే కు కూడా మింగుడుపడటం లేదు. తన పార్టీకి సుదీర్ఘకాలంగా రాజకీయ శత్రువుగా ఉన్న డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థిితిని ఆరాతీయడం స్టాలిన్ ముందుచూపుకు నిదర్శనమంటున్నారు. మొత్తం మీద పదేళ్ల పాటు స్టాలిన్ పాతుకుపోవడానికి పాదులు తీస్తున్నారన్నది వాస్తవం.

Tags:    

Similar News