వాళ్ల వీక్ పాయింట్ తెలుసుకుని మరీ?

కాంగ్రెస్ ను వదులుకోకుండా ఏదో రకంగా సంతృప్తి పర్చాలన్నది డీఎంకే అధినేత స్టాలిన్ ఉద్దేశ్యంగా కన్పిస్తుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమకు ఎక్కువ [more]

Update: 2021-02-18 16:30 GMT

కాంగ్రెస్ ను వదులుకోకుండా ఏదో రకంగా సంతృప్తి పర్చాలన్నది డీఎంకే అధినేత స్టాలిన్ ఉద్దేశ్యంగా కన్పిస్తుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమకు ఎక్కువ స్థానాలను కావాలని పట్టుబడుతోంది. అయితే ఇందుకు స్టాలిన్ సిద్ధంగా లేరు. గత ఎన్నికల ఫలితాలను తమకు గుణపాఠం నేర్పాయంటున్నారు. డీఎంకే హవాతోనే సీట్లు గెలుస్తామని, కూటమిలోని పార్టీల కారణంగా అధికారానికి దూరం కావాల్సి వస్తుందని, మరోసారి అటువంటి తప్పులు జరగకూడదని స్టాలిన్ గట్టిగా నిర్ణయించుకున్నారు.

కాంగ్రెస్ ను వదులకోవడం……

కాంగ్రెస్ ను వదులుకోవడం ఇష్టంలేదు. మోదీ మీద మోజు తగ్గిపోతున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అండదండలు కాంగ్రెస్ కు అవసరం. అయితే తమిళనాడులో కాంగ్రెస్ ప్రభావం ఏమాత్రం ఉండదు. ఇది తెలిసినా కాంగ్రెస్ పార్టీ గొంతెమ్మ కోర్కెలను కోరడాన్ని స్టాలిన్ తప్పుపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరవై స్థానాలను ఆశిస్తుంది. లేకుంటే గత ఎన్నికలలో కేటాయించిన 41 నియోజకవర్గాలనయినా ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.

దానిని సంతృప్తి పర్చేందుకు…..

కానీ స్టాలిన్ ఈ ప్రతిపాదనకు ససేమిరా అంటున్నారు. కాంగ్రెస్ ను సంతృప్తి పర్చేందుకు ప్రత్యేక వ్యూహరచనలను చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ ను వదులుకోకూడదు. అలాగని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కారణంగా తాము నష్టపోకూడదు. ఇదీ స్టాలిన్ ఆలోచన. అందుకోసమే రానున్న కాలంలో తమిళనాడు నుంచి రెండు రాజ్యసభ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తామని సంకేతాలను కాంగ్రెస్ అధిష్టానానికి పంపారు.

దాని అవసరాన్ని గుర్తించి…..

నిజానికి రాజ్యసభలో కాంగ్రెస్ అధిష్టానానికి అవసరం ఉంది. కొందరు సీనియర్ నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభ పదవులను కేటాయించాలి. అప్పుడే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ సెట్ అవుతుంది. అతి తక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉండటంతో రాజ్యసభ సభ్యులను ఎంపిక చేయడం కాంగ్రెస్ కు కష్టంగా మారింది. అందువల్లనే వీక్ పాయింట్ పై స్టాలిన్ కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో పాటు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కు రెండు మంత్రి పదవులు ఇస్తామని కూడా స్టాలిన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద స్టాలిన్ రాజ్యసభ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు తప్పించి అసెంబ్లీ స్థానాలను ఇచ్చేందుకు మాత్రం రెడీగా లేరు.

Tags:    

Similar News