అందరిలోనూ టిక్కెట్ టెన్షన్.. తలనొప్పులు తప్పవా?

తమిళనాడులో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అధికార, విపక్ష పార్టీలు ప్రజలకు హామీ ఇచ్చే పనిలో పడ్డాయి. పళనిస్వామి ప్రభుత్వం ఇన్నాళ్లు కుదురుగా ఉంటుందని డీఎంకే అధినేత స్టాలిన్ [more]

Update: 2021-02-27 16:30 GMT

తమిళనాడులో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అధికార, విపక్ష పార్టీలు ప్రజలకు హామీ ఇచ్చే పనిలో పడ్డాయి. పళనిస్వామి ప్రభుత్వం ఇన్నాళ్లు కుదురుగా ఉంటుందని డీఎంకే అధినేత స్టాలిన్ సయితం ఊహించలేదు. అయితే ఈసారి అధికారంలోకి ఎలాగైనా రావాలన్న పట్టుదలతో డీఎంకే అధినేత స్టాలిన్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. డీఎంకేలో సీట్ల కోసం పోటీ కూడా బాగా పెరిగింది. సీట్ల కేటాయింపు తర్వాత నేతల్లో అసంతృప్తి పెరగకుండా స్టాలిన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బలమైన అభ్యర్థుల కోసం…..

డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని స్టాలిన్ గట్టిగా నమ్ముతున్నారు. సర్వే రిపోర్టులు తనకే అధికంగా ఉండటం, శశికళ జైలు నుంచి విడుదల కావడం తనకు ఉపకరిస్తుందని స్టాలిన్ నమ్ముతున్నారు. అందుకే తాము పోటీ చేసే స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు. దాదాపు 180 నియోజకవర్గాల్లో డీఎంకే పోటీ చేయాలన్నది స్టాలిన్ నిర్ణయంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలు చేస్తుంది.

ఐదుగురు నుంచి ఆరుగురు….

ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదుగురు నుంచి ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సీనియర్ నేతలు సయితం తమ వారసులను రంగంలోకి దించే ప్రయత్నంలో ఉండటంతో అభ్యర్థుల ఎంపిక స్టాలిన్ కు సమస్యగా మారనుంది. అందుకే పార్టీ టిక్కెట్ కోసం ఇరవై ఐదు రూపాయల ఫీజు కూడా పెట్టారు. దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను పరిశీలించి, పూర్తి స్థాయి అథ్యయనం చేసిన తర్వాతనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్టాలిన్ నేతలను ముందు నుంచే మానసికంగా సిద్ధం చేస్తున్నారు.

పీకే టీందే ఫైనల్……?

అయితే అభ్యర్థుల ఫైనల్ జాబితా వచ్చిన తర్వాత స్టాలిన్ కు తలనొప్పులు తప్పేట్లు లేవు. ఇందుకోసం స్టాలిన్ కూడా ఫార్ములాను సిద్దం చేేసుకుని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ రాని వారికి పార్టీ అధికారంలోకి రాగానే పదవులు ఇస్తామని స్టాలిన్ ప్రామిస్ చేసే అవకాశాలున్నాయి. పూర్తిగా ప్రశాంత్ కిషోర్ టీం పర్యవేక్షణలోనే అభ్యర్థుల వడపోత జరుగుతుందని స్టాలిన్ నేతలకు చెప్పడంతో అందరిలోనూ టిక్కెట్ టెన్షన్ మొదలయింది.

Tags:    

Similar News