స్టాలిన్ కు అసలు సమస్య అదేనా?

ిఇతర రాష్ట్రాల మాదిరి తమిళనాడు కాదు. నాయకత్వ సమయ్య ఉన్నా… అధికారం పోతుందని తెలిసినా పార్టీని వీడేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటారు. తమిళనాడులోనూ 21 మంది ఎమ్మెల్యేలపై [more]

Update: 2019-09-05 18:29 GMT

ిఇతర రాష్ట్రాల మాదిరి తమిళనాడు కాదు. నాయకత్వ సమయ్య ఉన్నా… అధికారం పోతుందని తెలిసినా పార్టీని వీడేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటారు. తమిళనాడులోనూ 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. అయినా అధికారంలో ఉన్న పార్టీ మాత్రం మ్యాజిక్ ఫిగర్ ను కాపాడుకుంటూనే వస్తుంది. బలమైన నాయకత్వం అన్నాడీఎంకేకు లేకపోయినా అధికారానికి దూరం కాకపోవడానికి అనేక కారణాలున్నాయి. ప్రధాన పార్టీల్లో నెలకొన్న నాయకత్వ లోపమే ఇందుకు ఒక కారణం కాగా, మరొకటి కేంద్రంలో తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఉండటమే.

కరుణానిధి అనంతరం….

నిజానికి డీఎంకే కూడా నిన్న మొన్నటి వరకూ నాయకత్వ సమస్య ఎదుర్కొంది. ఆ పార్టీ అధినేత కరుణానిధి మరణించేంతవరకూ ఆ పార్టీపై గట్టి అంచనాలే ఉన్నాయి. కరుణానిధి మరణం తర్వాత స్టాలిన్ చేతికి పగ్గాలు వచ్చాయి. అయితే స్టాలిన్ నాయకత్వంపై కూడా నమ్మకాలు లేవు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డీఎంకే ఘోర పరాజయం మూటగట్టుకోవడమే ఇందుకు కారణం. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూడా ఓటమి చెందడం స్టాలిన్ కు కొంత ఊరట నిచ్చే అంశమే.

ఎన్నికల్లో గెలవడంతో…..

ఇక తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఒక్క స్థానం తప్ప మిగిలిన అన్ని స్థానాలను డీఎంకే గెలుచుకుంది. అలాగే శాసనసభ ఉప ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలను డీఎంకే గెలుచుకుంది. దీంతో స్టాలిన్ పై అంచనాలు రెట్టింపయ్యాయి. అందుకే ఇతర పార్టీలకు చెందిన నేతలు ఇప్పుడు వరస బెట్టి డీఎంకేలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా దినకరన్ పార్టీ అయిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ నుంచి ముఖ్య నేతలందరూ డీఎంకే బాట పట్టారు.

రజనీ పార్టీపై…..

కానీ డీఎంకే ఇప్పటికే పదేళ్లు అధికారానికి దూరంగా ఉంది. 2021లో జరిగే ఎన్నికలు డీఎంకేతో పాటు స్టాలిన్ కు ప్రతిష్టాత్మకం. ఆ ఎన్నికల్లో అధికారంలోకి రాకుంటే స్టాలిన్ కు రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. రజనీకాంత్ కొత్త పార్టీతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా స్టాలిన్ ను ఇబ్బంది పెట్టే అంశమే. కమల్ హాసన్ పార్టీ పెద్దగా ప్రభావంచూపలేకపోయిందన్న ఆనందం స్టాలిన్ లో ఉన్నప్పటికీ రజనీకాంత్ పార్టీపై ఆయన ఆందోళన చెందుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News