నిజంగా ఇది ఎంత గొప్ప విషయం?

కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ప్రతి రోజూ కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కల్గిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా వంటి రాష్ట్రమే కరోనా భయంతో వణికిపోతుంది. ఇక [more]

Update: 2020-04-20 18:29 GMT

కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ప్రతి రోజూ కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కల్గిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా వంటి రాష్ట్రమే కరోనా భయంతో వణికిపోతుంది. ఇక భారత దేశంలో కూడా రోజుకు వెయ్యి కేసుల వరకూ నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే మణిపూర్ రాష్ట్రం మాత్రం కరోనా కేసులు లేకుండా దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలచిందనే చెప్పాలి.

మయన్మార్ కు సరిహద్దులో….

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ కు మయన్మార్ దేశంతో తూర్పున అంతర్జాతీయ సరిహద్దు ఉంది. మెయితీ జాతి ఎక్కువగా ఇక్కడ నివాసముంటుంది. దాదాపు ముప్ఫయి లక్షల జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచో విదేశీయులపై నిబంధనలు ఉన్నాయి. సున్నితమైన సరిహద్దు రాష్ట్రం కావడంతో ఈ రాష‌్ట్రంలోకి ఏ విదేశీయులు వచ్చినా ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. పది రోజులు మించి ఉండటానికి వీరు వీలులేదు. కేవలం పదిరోజులకు మాత్రమే మణిపూర్ రాష్ట్రంలో ఉండేందుకు విదేశీయులకు అనుమతిస్తారు.

కరోనా రహిత రాష్ట్రంగా…..

ఇప్పుడు కరోనా దేశంలో అన్ని రాష్ట్రాలనూ వణికిస్తుంది. కానీ మణిపూర్ మాత్రం కరోనా నుంచి తప్పించుకుంది. ఈ ఈశాన్య రాష్ట్రంలో కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులే నమోదయ్యాయి. అందులో ఒక యువతి యూకే నుంచి రావడంతో కరోనా సోకింది. మరో వ్యక్తి తబ్లిగి జమాత్ కు హాజరయి రావడంతో పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఈ ఇద్దరినీ 14 రోజుల పాటు చికిత్స అందించడంతో వారికి నెగిటెవ్ వచ్చింది.

అందరి సహకారం వల్లనే….

దీంతో ఇప్పుడు మణిపూర్ రాష్ట్రం కరోనా రహిత రాష్ట్రంగా మారింది. దేశంలోనే తొలి కరోనా రహిత రాష్ట్రంగా మణిపూర్ రికార్డు సాధించింది. ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయడం, ప్రజలు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడం వల్ల ఇది సాధ్యమయింది. ఒక్క మరణం కూడా లేకుండా కరోనా రహిత రాష్ట్రంగా మణిపూర్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

Tags:    

Similar News