డామినేషన్ కు శుభం కార్డు పడిందా?

నిన్న మొన్నటి వరకూ దూకుడుగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి సైలెంట్ అయ్యారు. రాజధాని విషయంలోనూ సుజనా ఏమాత్రం స్పందించడం లేదు. ప్రధానంగా బీజేపీ [more]

Update: 2020-09-02 15:30 GMT

నిన్న మొన్నటి వరకూ దూకుడుగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి సైలెంట్ అయ్యారు. రాజధాని విషయంలోనూ సుజనా ఏమాత్రం స్పందించడం లేదు. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం జరిగిన దగ్గర నుంచి సుజనా చౌదరి పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు. మాట్లాడాల్సిన అంశాలు ఏవీ లేవని రావడం లేదా? అంటే. అదేంకాదు బోలెడు అంశాలు ఏపీలో జరుగుతున్నాయి. అయినా సుజనా చౌదరి మాత్రం మౌనంగా ఉండటానికి కారణాలేంటన్న చర్చ కమలం పార్టీలో జరుగుతుంది.

మొన్నటి వరకూ యాక్టివ్ గానే…

సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లి బీజేపీలో చేరినా ఆయన యాక్టివ్ గా ఉండేవారు. మిగిలిన టీజీ వెంకటేష్, సీఎం రమేష్ ల కంటే సుజనా చౌదరి ఎక్కువగా కార్యక్రమాల్లో పాల్గొనే వారు. ప్రతి జల్లాలో ఆయన పర్యటించారు. కన్నా లక్ష్మీనారాయణతో కలసి పనిచేస్తూ పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయించేవారు. ఇక రాజధాని అమరావతి విషయంలో సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని పదే పదే చెప్పేవారు.

సోము వచ్చిన నాటి నుంచి…..

కానీ సోము వీర్రాజు అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత సుజనా వ్యాఖ్యలను ఖండించారు. ఆయన మాటలకు విలువ లేదని చెప్పకనే చెప్పారు. ఇక సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో జరిగిన కార్యక్రమానికి సుజనా చౌదరి డుమ్మా కొట్టారు. ఈయనతో పాటు కామినేని శ్రీనివాస్ కూడా గైర్హాజరవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది. రామ్ మాధవ్ లాంటి నేత హాజరైన కార్యక్రమానికి సుజనా రాకపోవడం వెనక సోము వీర్రాజును అధ్యక్షుడిని చేశారన్న బాధ కావచ్చన్న కామెంట్స్ కూడా విన్పించాయి.

వైరం ఎందుకన్న రీతిలో……

ఇక ఇటీవల జీవీఎల్ నరసింహారావుపైన కూడా సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు వచ్చాయి. జీవీఎల్ ను బదనాం చేయడానికి పరోక్షంగా సుజనా సహకరించారన్న అనుమానాలు కూడా బీజేపీ నేతల్లో ఉన్నాయి. మరోవైపు కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు తమ సూచనలను పరిగణనలోకి తీసుకునే పరిస్థిితి లేదని సుజనా చౌదరి గ్రహించారు. ఇంకా ఒకటిన్నర సంవత్సరమే రాజ్యసభకు గడువు ఉంది. ఈ పరిస్థితుల్లో బయటకు వచ్చి మాట్లాడి సొంత పార్టీ నేతలతో వైరం ఎందుకని సుజనా చౌదరి మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద సోము వీర్రాజు రాకతో సుజనాచౌదరి సైలెంట్ అయ్యారన్నది పార్టీలో విన్పిస్తున్న టాక్. సుజనా చౌదరి మాత్రమే కాదు ఆయన వెంట వచ్చి పార్టీలో చేరి అధికార ప్రతినిధులయిన వాళ్ల గొంతులు కూడా మూగవోయాయి.

Tags:    

Similar News