ఈయన ముందు సుజనా బలాదూర్

బీజేపీలో కొత్త పూజారి సుజనా చౌదరి తానే ఆ పార్టీ అధినాయకత్వం అనుకుంటున్నారని వైసీపీ నేతలు ఓ వైపు సెటైర్లు వేస్తున్న ఆయన మాత్రం టీడీపీ గొంతుతో [more]

Update: 2019-12-31 11:00 GMT

బీజేపీలో కొత్త పూజారి సుజనా చౌదరి తానే ఆ పార్టీ అధినాయకత్వం అనుకుంటున్నారని వైసీపీ నేతలు ఓ వైపు సెటైర్లు వేస్తున్న ఆయన మాత్రం టీడీపీ గొంతుతో బీజేపీ వేషాన్ని ఎక్కడా ఆపడంలేదు. కేంద్రం చూస్తూ ఊరుకోదంటూ చీటికి మాటికీ జగన్ ని బెదిరిస్తున్నారు. జగన్ మామూలు లీడరా. ఆయన అఖండమైన ప్రజాదరణ ఉన్న నేత. ఆయన్ని పట్టుకుని పొరపాటున ఏపీకి సీఎం అయ్యారని విమర్శలు చేస్తున్నారు చౌదరిగారు. తాను కేంద్రం అనుమతితోనే మాట్లాడుతున్నానని కూడా కొత్తగా తగిలింపు కూడా వేసుకుంటున్నారు. మరి ఆయనొక్కరేనా కేంద్రం అనుమతితో మాట్లాడేది, మిగిలిన నేతలు కూడా ఉన్నారు కదా. వారు మాత్రం సుజనా చౌదరికి భిన్నంగా వాదనలు వినిపించడమే ఇక్కడ విశేషం.

విశాఖ బెస్ట్ ప్లేస్…

ఈ మాటలు అన్నది ఎవరో కాదు, బాబు పక్కన కొన్నాళ్ళు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అమరావతి గుట్టూ మట్టూ అన్నీ తెలిసిన ఐవీఆర్ క్రిష్ణారావు. ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారని పేరుంది. పైగా మేధావి కూడా. జగన్ మీద ఆయనకు ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు కూడా ఏవీ లేవు. జగన్ పాలనలో తప్పులు ఉంటే గట్టిగానే కడిగేస్తున్నారు. అటువంటి ఐవీఆర్ విశాఖ ఏపీకి రాజధాని అయితే అభివ్రుధ్ధి చెందుతుందని ఘంటాపధంగా చెబుతున్నారు. ఆ ప్రగతిని ఆపడం ఎవరి తరం కూడా కాదని అంటున్నారు. విశాఖకు పోటీగా దక్షిణాదిన మరో నగరం కూడా నిలిచే అవకాశం లేదని ఆయన ఇండైరెక్ట్ గా హైదరాబాద్ ని కూడా ముగ్గులోకి లాగేశారు. అద్భుతమైన తీర ప్రాంతం ఉండడం విశాఖను వరమని, అందువల్ల ముంబైతోనే విశాఖకు పోటీ తప్ప మరే సిటీ కూదా దరిదాపుల్లోకి కూడా రాద‌ని విశ్లేషించారు.

సుజనా ఏమంటారో….?

మరి బీజేపీ పెద్దల వద్ద, ఇంకా చెప్పాలంటే ప్రధాని మోడీ దగ్గర కూడా పలుకుబడి కలిగిన నేతగా ఐవీఆర్ క్రిష్ణారావుని చెబుతారు. ఆయన ఈ మాటలు మీడియా ముందే కాదు, కేంద్రం వద్ద కూడా మాజీ ఐఏఎస్ గా కూడా చెప్పగలరు, పైగా ఆయన మాటకు ఫిరాయింపుల నేతల మాటల కన్నా కూడా ప్రధాని వద్ద ఎక్కువ విలువ ఉంటుందన్న సంగతి కూడా అందరికీ తెలుసు. కేంద్ర పెద్దలు సైతం ఇలాంటి తటస్థులు, మేధావుల మాటలకే తలఒగ్గుతారు. వారి అభిప్రాయాలు కూడా తెలుసు కుంటారు. ఇన్నాళ్ళూ టీడీపీలోనే కేరాఫ్ చిరునామా పెట్టుకుని ఇపుడు రాజకీయ అవసరాల కోసం బీజేపీ వైపు వచ్చిన సుజనా చౌదరి లాంటి వారి కధలు బీజేపీ పెద్దలకు తెలియకుండా ఉంటాయా అన్నది కూడా రాజకీయ పండితుల వాదన. అందువల్ల కేంద్రం అంటే నేనూ అనే సుజనా ఆర్భాటానికి సైలెంట్ గా ఐవీఆర్ క్రిష్ణారావు లాంటి వారు గట్టి రిటార్ట్ నే ఇచ్చేసారు. ఇపుడు మాజీ తమ్ముడు, తాజా కాషాయధారి సుజనా చౌదరి ఏమంటారో.

Tags:    

Similar News