వైసీపీ గూటికి మాజీ మంత్రి… పౌరుషాల గడ్డలో మారుతోన్న రాజకీయం
రాజకీయాల్లోఏదైనా జరగొచ్చు. ఎప్పుడు ఎలాంటి టర్న్‌లైనా తీసుకునే స్వేచ్ఛ రాజకీయాల్లో ఎప్పుడూ ఉంటుంది. ఇదే ఇప్పుడు వైసీపీలోనూ జరుగుతోందని అంటున్నారు గతంలో వైసీపీలో కీలక నేతగా ఎదిగిన [more]
రాజకీయాల్లోఏదైనా జరగొచ్చు. ఎప్పుడు ఎలాంటి టర్న్‌లైనా తీసుకునే స్వేచ్ఛ రాజకీయాల్లో ఎప్పుడూ ఉంటుంది. ఇదే ఇప్పుడు వైసీపీలోనూ జరుగుతోందని అంటున్నారు గతంలో వైసీపీలో కీలక నేతగా ఎదిగిన [more]
రాజకీయాల్లోఏదైనా జరగొచ్చు. ఎప్పుడు ఎలాంటి టర్న్‌లైనా తీసుకునే స్వేచ్ఛ రాజకీయాల్లో ఎప్పుడూ ఉంటుంది. ఇదే ఇప్పుడు వైసీపీలోనూ జరుగుతోందని అంటున్నారు గతంలో వైసీపీలో కీలక నేతగా ఎదిగిన విజయనగరం జిల్లా బొబ్బిలి రాజు సుజయ కృష్ణ రంగారావు త్వరలోనే మళ్లీ పాత గూటికి చేరేలా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్‌లో రాజకీయాలు ప్రారంభించిన సుజయ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు. తర్వాత వైఎస్‌పై ఉన్న అభిమానంతో ఆయన జగన్‌కు మద్దతు దారుగా మారారు. ఈ క్రమంలోనే వైసీపీ తరఫున 2014లో విజయం సాధించారు.
వైసీపీలో గెలిచి…..
టీడీపీకి కంచుకోట వంటి విజయనగరంలో సుజయ వైసీపీ రాజకీయాలను జోరెత్తించారు. అయితే, పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నా.. అనూహ్యంగా ఓడిపోవడంతో ఆయన టీడీపీ బాట పట్టారు. బొబ్బిలి రాజులు వైసీపీని వీడడం వెనక చాలా కారణాలే ఉన్నాయి. తమకు చిరకాల రాజకీయ శత్రువుగా ఉన్న బొత్స సత్యనారాయణను జగన్ తమకు ఇష్టం లేకపోయినా పార్టీలో చేర్చుకోవడం కూడా వారు పార్టీ వీడడానికి మరో కారణం. ఇక టీడీపీ అధినేత.. అప్పటి సీఎం చంద్రబాబు.. మంత్రి పదవి ఇస్తానని ఆశ చూపడంతో సుజయ పార్టీ మారిపోయారు.
ప్రాధాన్యం తగ్గిపోవడంతో….
అనుకున్న విధంగానే చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. అయితే.. ప్రజలు సుజయపై ఉన్న నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోలేక పోయారు. పార్టీ మారి. రాజకీయాలు చేయడాన్ని హర్షించలేక పోయారు. దీంతోగత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసినా.. సుజయ విజయం సాధించలేక పోయారు. ఇక, ఆ తర్వాత పార్టీలో అడపా దడపా కార్యక్రమాలు నిర్వహించినా.. అనుకున్న రేంజ్ గుర్తింపు రాలేదు సరికదా.. విజయ నగరంలో అశోక్ గజపతిరాజు దూకుడు ముందు సుజయ నిలబడలేక పోయారు. ఇదిలావుంటే.. టీడీపీలోనూ ఆయనకు ప్రాధాన్యం తగ్గిపోయింది.
పార్టీ మారేందుకు….
పార్టీ పదవులు సహా ఎందులోనూ ఆయనకు చంద్రబాబు చోటు ఇవ్వలేదు. పైగా చంద్రబాబు సుజయను నమ్మక ఆయన సోదరుడు బేబీ నాయనకు బొబ్బిలి పగ్గాలు అప్పగించారు. అప్పటి నుంచి సుజయ పార్టీ కార్యక్రమాల్లో, నియోజకవర్గంలోనూ కనపడడం లేదు. దీంతో ఇక, టీడీపీలో ఉండి లాభం లేదని అనుకుని ఉంటారని విజయనగరం రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే సుజయ కృష్ణరంగారావు పార్టీ మారేందుకు రెడీ అయ్యారని టాక్ నడుస్తోంది. మరో ట్విస్ట్ ఏంటంటే జగన్ చూపు మాత్రం సుజయ కంటే బేబీ నాయన వైపే ఉందట. ఈ నేపథ్యంలో బొబ్బిలి రాజులు ఇద్దరూ కూడా పార్టీ మారిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదన్న గుసగుసలు విజయనగరం జిల్లాలో వినిపిస్తున్నాయి.