ఆమె కోసం… నిరీక్షణ

సుమలత… మాండ్యా పార్లమెంటు సభ్యురాలు. గత పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దేవెగౌడ మనవడు, జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ గౌడను సుమలత [more]

Update: 2019-11-23 18:29 GMT

సుమలత… మాండ్యా పార్లమెంటు సభ్యురాలు. గత పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దేవెగౌడ మనవడు, జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ గౌడను సుమలత ఒంటరిగా ఓడించారు. మాండ్య పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అప్పటి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్న ప్పటికీ మాండ్య ప్రజలు సుమలతకు అండగా నిలిచారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ సుమలతకు మద్దతుగా పోటీ చేయలేదన్న సంగతి తెలిసిందే.

భర్త మరణంతో….

సుమలత భర్త సినీనటుడు అంబరీష్ మరణంతో ఆమె రాజకీయ అరంగేట్రం చేశారు. తన భర్త ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నా సుమలతకు కాంగ్రెస్ హ్యాండిచ్చింది. అప్పటి రాజకీయ నిర్ణయాలకు అనుగుణంగా జేడీఎస్ తో కలసి నడవాలని నిర్ణయించడంతో సుమలతకు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వలేకపోయింది. జేడీఎస్ తో కలసి పోటీ చేయాలని భావించడం, దేవెగౌడ మనవడు నిఖిల్ గౌడ పోటీ చేస్తానని ముందుకు రావడంతో కాంగ్రెస్ సుమలత విషయంలో చేతులెత్తేసింది.

పరోక్షంగా.. ప్రత్యక్షంగా….

చివరి వరకూ కాంగ్రెస్ టిక్కెట్ కోసం ప్రయత్నించిన సుమలత చివరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. సుమలత విజయం వెనక ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ నేతలున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలందరూ సుమలతకు దన్నుగా నిలిచారు. ఇక బీజేపీ ఎటూ బహిరంగంగా మద్దతిచ్చింది. దీంతో సుమలత సులువుగా మాండ్య పార్లమెంటు నియోజకవర్గంలో విజయం సాధించారు. ఆమె ప్రస్తుతం స్వతంత్ర పార్లమెంటు సభ్యురాలిగానే కొనసాగుతున్నారు.

ఉప ఎన్నిక విషయంలో…..

కానీ ఇప్పుడు వచ్చిన ఉప ఎన్నికలు సుమలతకు తలనొప్పి తెచ్చి పెట్టాయి. మాండ్య నియోజకవర్గం పరిధిలోని కె.ఆర్.పేట నియోజకవర్గం లో ఉప ఎన్నిక జరుగుతంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పరోక్షంగా మద్దతిచ్చిన తమకు అండగా నిలవాలని కాంగ్రెస్ స్థానిక నేతలు కోరుతున్నారు. కాంగ్రెస్ నేతలు చెలువరాయ స్వామి ఈ మేరకు సుమలతను కలిసి కోరారు. మరోవైపు నేరుగా మద్దతిచ్చిన తమకే దన్నుగా ఉండాలని బీజేపీ కోరుతోంది. దీంతో సుమలత ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సుమలత నిర్ణయం ఏ పార్టీ వైపు ఉండనుందన్నది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News