ఇక్కడ పాచికలు పారవని తెలుసుకున్నారా?

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతుంది. ఏపీ ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్ తిరుపతిలోనే మకాం వేసి పార్టీ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఎన్నికల్లో కనీసం [more]

Update: 2021-03-28 13:30 GMT

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతుంది. ఏపీ ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్ తిరుపతిలోనే మకాం వేసి పార్టీ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఎన్నికల్లో కనీసం రెండో స్థానమైనా దక్కించుకుని పరువు నిలుపుకోవాలన్న ప్రయత్నంలో సునీల్ దేవ్ ధర్ ఉన్నారు. తరచూ బీజేపీ నేతలతో సమావేశమవుతూ ఎక్కడ ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న దానిపై పక్కా ప్లానింగ్ చేస్తున్నారు. బీజేపీ, జనసేనల ఉమ్మడి అభ్యర్థి బరిలో ఉన్నారు.

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో….

ఇప్పుడు పార్టీ ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్ కు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. సునీల్ దేవ్ ధర్ కు మంచి వ్యూహకర్తగా పేరుంది. అనేక రాష్ట్రాల్లో బీజేపీని విజయం వైపు నడిపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అందుకే ఏరి కోరి సునీల్ దేవ్ ధర్ ను పార్టీ ఇన్ ఛార్జిగా అధినాయకత్వం నియమించింది. కానీ సునీల్ దేవ్ ధర్ వ్యూహాలు ఏపీలో పనిచేయడం లేదు. జనసేనతో పొత్తు పెట్టుకున్నా స్థానిక సంస్థల ఎనికల్లో ఏమాత్రం పనితీరు కనపర్చలేదు.

కేవలం ఒక వార్డులో….

తిరుపతి పార్లమెంటు పరిధిలోనే చూసుకుంటే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క వార్డులో మాత్రమే గెలిచింది. తిరుపతిలో అన్ని వార్డుల్లో జనసేన, బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగినా బీజేపీ ఏ ఒక్క వార్డులోనూ విజయం సాధించలేదు. తిరుపతి పై బీజేపీ బలం కన్నా పవన్ కల్యాణ్ పైనే సునీల్ దేవ్ ధర్ ఆశలు పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్ సామాజికవర్గం ఇక్కడ బలంగా ఉండటంతో ఆ ఓటు బ్యాంకును తాము సొంతం చేసుకోవాలని సునీల్ దేవ్ ధర్ భావిస్తున్నారు.

డిపాజిట్ దక్కుతుందా?

కానీ పవన్ కల్యాణ్ ప్రచారంలోకి వస్తారా? రాదా? అన్నది ఇంకా తేలలేదు. పవన్ కల్యాణ్ కు తెలంగాణ బీజేపీతో ఏర్పడిన విభేదాల ప్రభావం ఏపీపై కూడా చూపుతాయన్న ఆందోళన సునీల్ దేవ్ ధర్ లో ఉంది. అందుకే ఆయన పవన్ కల్యాణ్ ను ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేలా ఒప్పించాలని భావిస్తున్నారు. కానీ పరిశీలకులు మాత్రం తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ కి డిపాజిట్లు వస్తే గొప్పేనని అంటున్నారు. మొత్తం మీద తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సునీల్ దేవ్ ధర్ కు సవాల్ గా మారిందనే చెప్పాలి.

Tags:    

Similar News