సేఫ్ ప్లేస్ లేకనే కదా

తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి…. బావ భూమా నాగిరెడ్డి… ఇద్దరూ రాజకీయ ఉద్దండులే. తమ కార్యక్షేత్రాన్ని ఎంచుకంటే వారు అక్కడి నుంచి కదలరు. బతికి ఉన్నంతకాలం వారిద్దరూ నియోజకవర్గాల్లో [more]

Update: 2019-07-29 09:30 GMT

తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి…. బావ భూమా నాగిరెడ్డి… ఇద్దరూ రాజకీయ ఉద్దండులే. తమ కార్యక్షేత్రాన్ని ఎంచుకంటే వారు అక్కడి నుంచి కదలరు. బతికి ఉన్నంతకాలం వారిద్దరూ నియోజకవర్గాల్లో పట్టు సంపాదించుకోగలిగారు. అప్పుడప్పడూ ఓటమి పాలయినా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలకు తిరుగులేని నేతలుగా ఎదిగారు. కాని తండ్రి, బావ బాటలో మాత్రం ఎస్వీ మోహన్ రెడ్డి నడవటం లేదన్నది మాత్రం సుస్పష్టం.

చరిత్ర ఉన్న ఫ్యామిలీ అయినా….

కర్నూలు జిల్లాలో ఎస్వీ కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. ఎస్వీ సుబ్బారెడ్డి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గాన్ని తొలుత తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పత్తికొండ నుంచి పోటీ చేసిన ఎస్వీ సుబ్బారెడ్డి 1994, 1999, 2004 ఎన్నికల్లో గెలుపొందారు. పత్తికొండపై పట్టు సంపాదించుకున్నారు. తొలుత ఎస్వీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన 1972, 1983 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు.

కుమార్తెకు వదిలేయడంతో….

ఆ తర్వాత ఆయన ఆళ్లగడ్డను తన కుమార్తె భూమా శోభానాగిరెడ్డికి వదిలేశారు. దీంతో కుమారుడు ఎస్వీ మోహన్ రెడ్డికి ఒక నియోజకవర్గం అంటూ ఏమీ లేకుండా పోయింది. ఆళ్లగడ్డ, పత్తికొండల్లో ఎస్వీ కుటుంబానికి ఇప్పుడు పట్టులేకపోవడంతో 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఎస్వీ మోహన్ రెడ్డిని కర్నూలు నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. దీంతో అక్కడి నుంచి గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీలోనే కొనసాగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

తిరిగి టీడీపీలోకి వెళ్లలేక…..

కాని బావ భూమా నాగిరెడ్డి పార్టీ మారడంతో తాను కూడా టీడీపీలోకి వెళ్లిపోయారు. అయితే టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా కర్నూలు టిక్కెట్ దక్కక పోవడంతో తిరిగి వైసీపీలో చేరారు. మేనకోడలు టీడీపీలో తాను వైసీపీలో ఉంటున్నారు. ఇప్పుడు జగన్ తాను నమ్ముకుని, తన వెంట పదేళ్లుగా నడిచిన వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వైసీపీలో ఇక ఎస్వీకి ఛాన్స్ లేనట్లే. ఇక టీడీపీలోకి వెళ్లేందుకు మార్గం ఓపెన్ అయినా ఆయన ఎందుకో సుముఖత చూపడం లేదు. తన ప్రధాన ప్రత్యర్థి టీజీ వెంకటేష్ టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లడంతో ఎస్వీకి వెళ్లేందుకు అవకాశమున్న ప్పటికీ ఆయన సంకోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద తండ్రి, బావల్లాగా తనకంటూ పట్టున్న నియోజకవర్గాన్ని ఏర్పరచుకోకపోవడమే ఎస్వీ చేసిన తప్పు అని అంటున్నారు.

Tags:    

Similar News