ఎస్వీకి విలువే లేదటగా
పార్టీ మారుతుంటే విలువండదు. అదీ అధికారంకోసం పార్టీ మారితే ప్రజలతో పాటు అధికారులు కూడా గుర్తుంచుకుంటారు. ఇప్పుడు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పరిస్థితి [more]
పార్టీ మారుతుంటే విలువండదు. అదీ అధికారంకోసం పార్టీ మారితే ప్రజలతో పాటు అధికారులు కూడా గుర్తుంచుకుంటారు. ఇప్పుడు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పరిస్థితి [more]
పార్టీ మారుతుంటే విలువండదు. అదీ అధికారంకోసం పార్టీ మారితే ప్రజలతో పాటు అధికారులు కూడా గుర్తుంచుకుంటారు. ఇప్పుడు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పరిస్థితి అలాగే ఉంది. ఆనాడు అధికారం కోసం పార్టీ చేరిన ఎస్వీ మోహన్ రెడ్డి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పటికి ఫలితం లేదు. అధిష్టానం నుంచి అధికారుల వరకూ ఎవరూ ఎస్వీ మోహన్ రెడ్డి మాట వినే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో ఆయన అధికార పార్టీలో ఉన్నా లేనట్లే అన్న సెటైర్లు విన్పిస్తున్నాయి.
బావ వెంట నడిచి….
ఎస్వీ మోహన్ రెడ్డి భూమా నాగిరెడ్డి బావమరిది. 2014 ఎన్నికలలో ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. అయితే భూమా నాగిరెడ్డి వైసీపీని వీడి అప్పటి అధికార తెలుగుదేశం పార్టీలో చేరడంతో బావ వెంట నడవక ఎస్వీ మోహన్ రెడ్డికి తప్పింది కాదు. దీంతో ఆయన టీడీపీలో చేరి జగన్ ను, వైసీపీని అనేకసార్లు విమర్శించారు. అప్పటికే కర్నూలు ఇన్ ఛార్జిగా ఉన్న టీజీ భరత్ తో ఎస్వీ మోహన్ రెడ్డికి పడక పోవడంతో భూమా నాగిరెడ్డి మరణం తర్వాత కొంత ఇబ్బంది పడ్డారనే చెప్పాలి.
తిరిగి వైసీపీలో చేరి…..
అయితే 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఎస్వీ మోహన్ రెడ్డికి టీడీపీ హ్యాండ్ ఇచ్చింది. భూమా కుటుంబంలో అప్పటికే ఆళ్లగడ్డ, నంద్యాల టిక్కెట్లు ఇవ్వడంతో చంద్రబాబు ఎస్వీ మోహన్ రెడ్డిని పక్కన పెట్టి టీజీ భరత్ కు టిక్కెట్ కేటాయించారు. దీంతో ఎస్వీ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలో చేరిపోయారు. అఖిలప్రియ, భూమ బ్రహ్మానందరెడ్డిలు టీడీపీలోనే ఉన్నా ఆయన మాత్రం వైసీపీలో చేరిపోయారు. తాను తప్పు చేశానని ఎస్వీ మోహన్ రెడ్డి అంగీకరించారు.
ఎమ్మెల్యే వర్సెస్ ఎస్వీ…..
అయితే 2019 ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచిన హఫీజ్ ఖాన్ పై ఆధిపత్యం ప్రదర్శించాలని ఎస్వీ మోహన్ రెడ్డి ప్రయత్నించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు తెలియకుండా వైసీపీలో కొందరిని చేర్చుకోవడంపై కూడా హఫీజ్ ఖాన్ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఎస్వీ మోహన్ రెడ్డి విషయంలో అధిష్టానం సయితం కొంత ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. అధికారులకు కూడా ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పిన పనులు చేయవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయంటున్నారు. పాపం అధికారం కోసం పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యేను ఇటు అధిష్టానం, అటు అధికారులు పట్టించుకోవడం లేదట.