ముగ్గురు ఫ్చూచర్ ఐదేళ్ల పాటు వాయిదానే?

తమిళనాడు ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే తమిళనాడు ఎన్నికలు కొందరి రాజకీయ ఆశలు పూర్తిగా అడియాసలు చేశాయి. అనుకోని పరిణామాలు, ఊహించని ఘటనలు ముగ్గురి రాజకీయ భవిష్యత్ అంధకారంలో [more]

Update: 2021-04-18 18:29 GMT

తమిళనాడు ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే తమిళనాడు ఎన్నికలు కొందరి రాజకీయ ఆశలు పూర్తిగా అడియాసలు చేశాయి. అనుకోని పరిణామాలు, ఊహించని ఘటనలు ముగ్గురి రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడింది. వీరు ముగ్గురూ తమ రాజకీయ భవిష్యత్ కోసం మరో ఐదేళ్ల పాటు ఆగాల్సిందే. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నిలకు పూర్తయిన తర్వాత ఈ ముగ్గురి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది.

పార్టీ పెట్టాలనుకున్నా….

రజనీకాంత్ … ఈ అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ పార్టీ పెట్టాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు ఆయన చేసుకున్నారు. సభ్యత్వాలను చేర్పించారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి అభిమానులను ఉత్సాహ పరిచారు. తమిళనాడులో లక్షల సంఖ్యలో ఉన్న రజనీకాంత్ అభిమానులు ఆయన పార్టీ ప్రకటన చేస్తారని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనను విరమించుకున్నారు. రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే మరో ఐదేళ్లు ఆగాల్సిందే.

కీలక భూమిక పోషించాలనుకున్నా…

ఇక మరో నేత శశికళ. జయలలితకు అత్యంత సన్నిహితంగా ఉన్న శశికళ నాలుగున్నరేళ్ల పాటు అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించారు. ఎన్నికలకు ముందే శశికళ విడుదలయ్యారు. తమిళనాడు రాజకీయాల్లో శశికళ ముఖ్య భూమిక పోషిస్తుందని భావించారు. జైలు నుంచి విడుదలయినప్పుడు భారీ స్వాగత ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ఉన్నట్లుండి శశికళ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటంచి తమిళనాడులోని ఆమె అభిమానులకు షాక్ ఇచ్చారు. శశికళ రాజకీయాల్లో రాణించాలంటే మరో ఐదేళ్లు ఆగాల్సిందే.

అటు ఇటు చూసినా..?

మరో కీలక నేత ఆళగిరి. కరుణానిధి కుమారుడైన ఆళగిరి తండ్రి మరణం తర్వాత డీఎంకేలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ స్టాలిన్ అంగీకరించకపోవడంతో రజనీకాంత్ పార్టీలో చేరాలనుకున్నారు. రజనీ కూడా వెనక్కు తగ్గడంతో తమిళనాడులో సొంత పార్టీ పెట్టాలని భావించారు. కానీ సాధ్యపడలేదు. ఆళగిరి ఏ రాజకీయ పార్టీ పెట్టకుండానే తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. ఈ నేతలు ముగ్గురు మర ఐదేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాల్సందే.

Tags:    

Similar News